పూరి మరోసారి చిరు సినిమా గురించి స్పందించాడు. చిరంజీవి 150వ సినిమా చేసే హక్కు నాకే ఉందని ఈసారి ఆయన కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు. ఒకవేళ చిరుకి కథ నచ్చకపోతే నచ్చేవరకు కథ రాస్తానని స్పష్టం చేశాడు. ఫేస్‌బుక్ ద్వారా పూరి జగన్నాథ్ బుధవారం ఓ బహిరంగ లేఖని విడుదల చేశాడు. చిరంజీవిని తెరపై ఎలా చూడాలనే విషయం ఆయనకంటే అభిమానులకే బాగా తెలుసని, ఓ పెద్ద అభిమానినైన చిరంజీవితో సినిమా చేయడమే నా కోరిక అని బహిరంగ లేఖలో స్పష్టం చేశాడు పూరి.
ఇప్పటికే చిరు 150వ సినిమాకోసం పూరి జగన్నాథ్ ఆటోజానీ కథ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ కథ సగం బాగుందనీ, మిగతా సగం నచ్చలేదని చిరు తిరస్కరించాడు. అయితే అది నేరుగా పూరికి చెప్పకుండా మీడియాకి చెప్పేశాడు. అదే విషయం నాకు చెప్పుంటే మార్పులు చేసేవాడిని కదా అని ఇటీవల మీడియా ముందు పూరి చెప్పుకొచ్చాడు. అప్పట్నుంచి చిరు 150వ సినిమా గురించి మరింత వేడి రాజుకొంది. అయితే చిరు కథ నచ్చలేదన్నా ఆయనతో సినిమా చేసే విషయంలో మాత్రం పూరిలో ఆశ చావలేదన్న విషయం స్పష్టమవుతోంది.
చిరుకి కథ నచ్చకపోతే మరో కథ రాస్తాననీ, అదీ నచ్చకపోతే నచ్చేవరకు రాస్తూనే ఉంటాననీ, చిరు 150వ సినిమా కాకపోయినా, 151వ సినిమాకైనా నేను దర్శకత్వం వహిస్తానని ఆ లేఖలో తన మనోగతాన్ని వెల్లడించాడు పూరి. అది చూసి మెగాభిమానులు శభాష్ పూరి అంటున్నారు. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఎలా రిప్లై వస్తుందో చూడాలి.