ఆర్నెళ్లు ఆళ్లు ఈళ్లతో సావాసం చేస్తే ఏదో అయ్యిందంట! చూస్తుంటే ఈ సందర్భానికి ఇది సరిగ్గా అతుకుతుంది. ఇటీవలి కాలంలో విజయ్ దేవరకొండ పబ్లిక్ వేదికలపై విసురుతున్న పంచ్ లు వింటుంటే ఎవరైనా అతడిని పూరీ పూనాడని.. మైండ్ లోకి పూరీలోని పంచ్ లు ఎక్కేశాయ్ అని ఈజీగా గ్రహించేస్తారు!
ఈరోజు దిల్లీ ప్రమోషన్స్ లో వీడీ పంచ్ లు వింటే కచ్ఛితంగా ఇవి పూరి మార్క్ డైలాగులు అని ఎవరైనా చెబుతారు. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమన్నాడు? అంటే...``నాకు మా అమ్మ ఆశీర్వాదం ఉంది.. ప్రజల ప్రేమాభిమానాలు ఉన్నాయి.. దేవుడి కృప ఉంది. గెలవాలనే ఫైర్ లోపల ఉంది.
ఇక మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాను`` అంటూ `బాయ్ కాట్ లైగర్` ప్రచారకర్తలకు కౌంటర్ వేసాడు. గత కొంతకాలంగా తన సినిమాపై నెటిజనుల్లో సాగుతున్న ప్రచారానికి కౌంటర్ గట్టిగానే వేసాడు.
స్వతహాగానే విజయ్ మాటకారి. ప్రతిసారీ వేదికలపై అతడి పంచ్ లు అద్భుతంగా పేల్తూనే ఉన్నాయి. సక్సెస్ తో వచ్చిన కిక్కు విజయ్ దేవరకొండలో స్పష్ఠంగా కనిపిస్తుంది. ఇక దాంతో అతడు వేదికలపై చెలరేగుతున్నాడు. ఇప్పుడు ఏకంగా అతడి పంచ్ లు పాన్ ఇండియా లెవల్ కి చేరుకున్నాయ్.
గల్లీ నుంచి దిల్లీ వరకూ ఒకటే పంచ్ లు విసిరేస్తూ లైగర్ కి బోలెడంత పబ్లిసిటీ చేశాడు దేవరకొండ. ఈనెల 25న ఈ చిత్రం తెలుగు -హిందీ సహా అన్ని భాషల్లో విడుదలవుతోంది. ప్రచారం పరంగా ఏ లోపం లేదు. రేపు సినిమా రిలీజై కంటెంట్ పరంగా ఎలాంటి లోపం లేదని క్రిటిక్స్ తేల్చాల్సి ఉంటుంది. చిన్నపాటి లోపాలు ఉన్నా కానీ పూరీ మార్క్ మాసిజం ఎమోషన్ ఈ మూవీ రేంజును పీక్స్ కి చేరుస్తాయనే భావిస్తున్నారు.