రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లైగర్'. 'సాలా క్రాస్ బీడ్' అని ట్యాగ్ టైన్. వెర్సటైల్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ మూవీకి పూరి, చార్మి, అపూర్వ మొహతాలతో కలిసి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ నుంచి దాదాపు రెండేళ్ల విరామం తరువాత వస్తున్న సినిమా ఇది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ, మకరంద్ దేశ్ పాండే ఇతర పాత్రల్లో నటించారు. ఆగస్టు 25న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్న ఈ మూవీని ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. గురువారం ఈ మూవీ ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ తెలుగులో, హిందీ ట్రైలర్ ని రణ్ వీర్ సింగ్, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఇదే సందర్భంగా హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎం.ఎం థియేటర్లో 'లైగర్' ట్రైలర్ ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ అన్న మాటలు ఇప్పడు చర్చనీయాంశంగా మారాయి. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పూరి మాట్లాడుతూ 'అన్నా.. ఎట్లుంది ట్రైలర్.. విజయ్ ఎట్లున్నడు.. చింపిండా లేదా?..మాకీ కిరికిరి చించేశాడు సినిమా. అన్నా.. నేను లైగర్ గురించి చెప్పడం లేదు..విజయ్ గురించి చెబుతున్నా.. హీ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద కంట్రీ.. హీ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా. రాసిపెట్టుకోండీ..
కరణ్ జోహార్ గారికి థాంక్స్. ఆయన మాకు బిగ్ సపోర్ట్. ఆయనని ఇక్కడికి పిలిచింది ట్రైలర్ చూపించడానికి కాదు. మిమ్మల్ని చూపించడానికి పిలిచాను. మాకు సినిమా అంటే ఎంత పిచ్చో ఆయనకు చూపిద్దామని తీసుకొచ్చాను. కరెక్ట్ గా సినిమా రిలీజ్ నెలరోజులుందన్నా. ఇలాగే వుండండి...ఇలాగే వుంటది కుమ్మేద్దాం' అన్నాడు పూరి జగన్నాథ్. పూరిలో ఇంత కాన్ఫిడెంట్ కి కారణం ఏంటీ? .. విజయ్ ఇండియన్ సినిమాని ఏలేస్తాడని అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెబుతున్నాడు?. ఇంతకీ 'లైగర్'లో ఏముంది? .. ఏం చూపించబోతున్నారు?.
రాసి పెట్టుకోండి.. అని పూరి బలంగా చెప్పడం వెనక సినిమాపై వున్న కాన్ఫిడెన్స్ కారణంగా కనిపిస్తోంది. గత రెండేళ్లుగా శ్రమించిన 'లైగర్'తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయాలన్న కసి, పట్టుదలతో చేశారు. అయితే క్లైమాక్స్ విషయంలో రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అది కరెక్ట్ గా కనెక్ట్ అయి సగటు ప్రేక్షకుడు కన్విన్స్ కాగలిగితే బొమ్మ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అని తెలుస్తోంది. అదే కన్విన్సింగ్ గా లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. పూరి కాన్షిడెన్స్ ఎంత వరకు నిజమవుతుందన్నది తెలియాలంటే ఆగస్టు 25 ఉదయం షో పడే వరకు వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
Full View