రేపే 'పుష్ప 2' పూజా కార్యక్రమాలు

Update: 2022-08-21 12:00 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్ కాంబో మూవీ పుష్ప ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. ఆ సినిమా విడుదల అయిన వెంటనే పుష్ప 2 సినిమా ను ఈ ఏడాది ఆరంభంలో అంటే ఫిబ్రవరిలో ప్రారంభించాల్సి ఉంది. కాని స్క్రిప్ట్‌ విషయంలో చాలా సుదీర్ఘమైన చర్చలు నిర్వహించిన నేపథ్యంలో పుష్ప 2 సినిమా ఆలస్యం అయ్యింది.

పుష్ప 2 ను పాన్‌ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్ 2 కి ఏమాత్రం తగ్గకుండా చేయాలనే ఉద్దేశ్యంతో పక్కా గా ప్లాన్‌ చేశారు. కేజీఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను ఎలా అయితే దక్కించుకుందో పుష్ప 2 సినిమా అదే స్థాయిలో వసూళ్లు చేయాలనే పట్టుదలతో అల్లు అర్జున్‌ అభిమానులు ఉన్నారు. సుకుమార్ కూడా అదే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ సమయం ను తీసుకున్నాడు.

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. రేపు సినిమా యొక్క పూజా కార్యక్రమాలను లాంచనంగా నిర్వహించబోతున్నట్లుగా మైత్రి మూవీస్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది. అదుగో ఇదుగో అంటూ వాయిదా వేసిన పుష్ప 2 ను పట్టాలెక్కించేందుకు అన్ని సిద్ధం చేశారు.

సుకుమార్‌ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. అందుకే సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. పుష్ప 2 లో బాలీవుడ్‌ స్టార్స్ ను రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక రష్మిక మందన్నా హీరోయిన్ పాత్రను కంటిన్యూ చేయనుంది. సమంత ఐటెం సాంగ్‌ కంటిన్యూ అయ్యేది చెప్పలేం. ఇక సునీల్ మరియు అనసూయ లు వారి వారి పాత్రల్లో ఉండే అవకాశం ఉంది. మొత్తానికి పుష్ప 2 సినిమా మరో లెవల్ అన్నట్లుగా ఉండబోతుంది అనే నమ్మకంతో అంతా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News