రష్యన్‌ పుష్ప హిట్‌... కాదు అట్టర్ ఫ్లాప్‌

Update: 2023-01-03 14:30 GMT
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో 2021 డిసెంబర్ లో వచ్చిన పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో మినిమం ప్రమోషన్ కూడా చేయకుండా భారీగా వసూళ్లు నమోదు చేసింది. అక్కడ వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపర్చిన విషయం తెల్సిందే.

పుష్ప సినిమా విడుదల అయిన ఏడాది తర్వాత అంటే గత ఏడాది డిసెంబర్‌ లో రష్యా లో విడుదల చేశారు. రష్యన్‌ లాంగ్వేజ్ లో డబ్‌ చేసి పెద్ద ఎత్తున ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ సమయంలో అల్లు అర్జున్‌.. రష్మిక మందన్నా.. సుకుమార్‌.. దేవి శ్రీ ప్రసాద్‌ ఇంకా నిర్మాతలు కూడా రష్యాలో పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రష్యా లో పుష్ప ను ప్రమోట్‌ చేయడం కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఆ ఖర్చు డబ్బులు కూడా వెనక్కి రాలేదు అంటూ పుష్ప రష్యన్‌ వర్షన్‌ కు టాక్‌ వచ్చింది. విడుదల అయ్యి మూడు వారాలు దాటింది. ఇప్పటి వరకు పది మిలియన్ల రూబుల్స్ వసూళ్లు అయ్యాయి. ఇండియన్ కరెన్సీ లో కోటి రూపాయలకు కాస్త అటు ఇటుగా పుష్ప రష్యన్‌ వర్షన్ రాబట్టింది.

రష్యన్ బాక్సాఫీస్‌ వద్ద పుష్ప సినిమా సూపర్‌ హిట్‌ గా దూసుకు పోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా విడుదల చేసిన పోస్టర్‌ అందరిని ఆశ్చర్యపర్చుతుంది. 25 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప 10 మిలియన్ ల రూబుల్స్ ను వసూళ్లు చేసింది.. ఇంకా 774 స్క్రీన్స్ లో స్క్రీనింగ్ అవుతుందని అధికారికంగా పేర్కొన్నారు.

కోటి రూపాయల కలెక్షన్స్ నమోదు అయితేనే భారీ విజయమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. 10 మిలియన్ ల రూబుల్స్ వచ్చాయంటూ గొప్పగా ప్రచారం చేస్తున్నారు. 10 మిలియన్ ల డాలర్లు అయితే గొప్ప విషయం కానీ రూబుల్స్ కు రూపాయికి ఎక్కువ తేడా లేదు.

కనుక అక్కడ నమోదు అవుతున్న కలెక్షన్స్ గొప్ప కలెక్షన్స్ ఏమీ కాదని.. కనుక రష్యా లో పుష్ప ఫ్లాప్ అంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా 774 థియేటర్లలో ఈ సినిమా ఆడుతుంది కనుక ముందు ముందు మరిన్ని కలెక్షన్స్‌ నమోదు అవుతాయేమో చూడాలి. మొత్తానికి రష్యా లో పుష్ప ఫలితం పై మిశ్రమ స్పందన వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News