సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా ''పుష్ప''. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన పుష్ప షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి దట్టమైన అడవుల్లో షూటింగ్ చేస్తున్నారు. మారేడిమిల్లిలో మిగిలిపోయిన ప్యాచ్ వర్క్స్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
రామోజీ ఫిలిం సిటీ వెనకాల ఉన్న ప్రాంతంలో 'పుష్ప' షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. బన్నీతో సహా మిగిలిన స్టార్ కాస్ట్ అంతా ఈ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఆ తరువాత జనవరిలో తమిళనాడులోని టెన్ కాశీలో ఈ సినిమా షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. అక్కడ రెండు సాంగ్స్ కూడా షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఏదేమైనా అనేక కారణాలతో లేట్ అవుతూ వచ్చిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేయాలని సుక్కు అండ్ టీమ్ డిసైడైనట్లు తెలుస్తోంది.