అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమా ఇతర భాషల మార్కెట్ కోసం పలువురు పక్క భాషల స్టార్స్ ను తీసుకు వచ్చారు. పుష్ప సినిమా లోని యాక్షన్ సన్నివేశాలు మరియు ఇతర మాస్ సన్నివేశాలు మామూలుగా ఉండవు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ముఖ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు అంచనాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో తెలుగు ప్రేక్షకులు పుష్ప సినిమా పై ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు పెంచుకుని వెయిట్ చేస్తున్నారు.
పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్.. ఓటీటీ రైట్స్ ఇంకా శాటిలైట్ రైట్స్ ధర లు అన్ని కూడా మారు మ్రోగి పోయే అవకాశం ఉంది. కాని ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా అంతగా బిజినెస్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. పైగా మలయాళం స్టార్ ఫాహద్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. కనుక అక్కడ పుష్ప కు మంచి రేటు దక్కవచ్చు. కాని ఇతర భాషలు అయిన కన్నడం.. హిందీ మరియు తమిళ భాషల్లో మాత్రం పుష్ప పరిస్థితి ఏంటీ అంటే ఇప్పుడే చెప్పలేమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పుష్ప హిందీ రైట్స్ ను గతంలోనే 17.5 కోట్లకు అమ్మినట్లుగా వార్తలు వచ్చాయి. అది ఎంత వరకు నిజం అనేది క్లారిటీ లేదు. కాని పుష్ప రేంజ్ కు ఆ మొత్తం చాలా తక్కువ అంటున్నారు. కనీసం పాతిక కోట్లు అయినా హిందీ రైట్స్ కు పుష్ప రాబట్టాల్సి ఉందంటున్నారు. ఇక తమిళ రైట్స్ విషయంలో కూడా బేరాలు సాగుతున్నాయి. అక్కడ అయిదు కోట్లకు మించి రావేమో అని కొందరు అంటున్నారు. కాని పుష్ప కు అక్కడ 10 నుండి 15 కోట్ల రాబట్టగల సత్తా ఉంది. ప్రస్తుతానికి పుష్ప గురించి తెలుగులో విపరీతమైన బజ్ ఉంది కాని ఇతర భాషల్లో లేదు. అందుకే పుష్ప సినిమా ను అక్కడి వారు భారీ మొత్తంతో కొనుగోలు చేయాలంటే విడుదల సమయంకు భారీగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.