కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన సంచలన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2' కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఈ సిరనిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది. అనేక వాయిదాలా మధ్య 'కేజీఎఫ్ 2 ' మొత్తానికి ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం మొదలు పెట్టింది.
'కేజీఎఫ్ చాప్టర్ 1' సంచలన విజయం సాధించడంతో చాప్టర్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ అంతకు మించి వుండటంతో ప్రేక్షకులు వరల్డ్ వైడ్ గా రాఖీ భాయ్ ప్రభంజనానికి ఫిదా అయిపోతున్నారు. సినిమాపై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు దాదాపు 700 కోట్లకు చేరువ కాబోతోందని తెలుస్తోంది.
హిందీ బెల్ట్ లోనే ఈ మూవీ 300 కోట్ల మార్కుని త్వరలో దాటే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే పలు రికార్డుల్ని తుడిచిపెడుతూ రికార్డు స్థాయిలో వసూళ్లని రాబటుడున్న కేజీఎఫ్ మరో సారి యస్ , ప్రశాంత్ నీల్ ల సత్తాని చాటుతోందని అంటున్నారు.
ఈ సినిమాపై ప్రముఖులు, స్టార్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొంత మంది క్రికెటర్స్ ఈ మూవీ స్పెషల్ షోస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ కి చెందిన ఓ టీమ్ ఏకంగా ఈ మూవీ స్పెషల్ షోని ఏర్పాటు చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'కేజీఎఫ్ 2' పై షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.
బన్నీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'కెజీఎఫ్ 2' కు అభినందనలు. స్వాగర్, ఇంటెన్సిటీ పర్ఫార్మెన్స్ ని యష్ ఇచ్చారు. అంతే కాకుండా ఈ మూవీలోని కీలక పాత్రల్లో నటించిన సంజయ్ దత్ గారు, రవీనా టాండన్ గారు అద్భుతంగా నటించారు. రవి బాస్రూర్ బీజీఎమ్స్, భువన్ గౌడ ఔట్ స్టాండింగ్ విజువల్స్ ని అందించిన ప్రతీ ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవిస్తున్నాను. ప్రశాంత్ నీల్ స్పెక్టాకులర్ షో ఇది. ఆయన విజన్ ని, కన్విక్షన్ ని గౌరవిస్తున్నాను. ఈ సినిమాతో ది గ్రేట్ సినిమాటిక్ అనుభూతిని అందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు' అన్నారు బన్నీ.
అంతే కాకుండా ఇండియన్ సినీ పతాకాన్ని పతాక స్థాయిలో రెపరెపలాడించినందుకు 'కేజీఎఫ్ 2' టీమ్ లోని ప్రతీ ఒక్కరికీ థాంక్స్ ' అని ప్రశంసలు కురిపించారు బన్నీ. అల్లు అర్జున్ త్వరలో 'పుష్ప' ఫ్రాంచైజీ 'పుష్ప ది రూల్' లో నటించబోతున్న విషయం తెలిసిందే. మరో 15 రోజుల్లో ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం కాబోతోంది. మేలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం యుఎస్ లో కసరత్తులు చేస్తున్నారు.