గోపీచంద్ సినిమాకు పీవీపీ అండ

Update: 2016-12-24 01:30 GMT
ఒక అడుగు ముందుకు.. నాలుగైదు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది కొన్నేళ్లుగా హీరో గోపీచంద్ పరిస్థితి. ‘లౌక్యం’తో గాడిన పడిందనుకున్న అతడి కెరీర్.. మళ్లీ ‘సౌఖ్యం’తో దెబ్బ తింది. దీనికి తోడు.. ఒకదాని తర్వాత ఒకటి రెండు సినిమాలు ముందు కదలకుండా మధ్యలో ఆగిపోయాయి. బి.గోపాల్ దర్శకత్వంలో చేసిన సినిమా మూణ్నాలుగేళ్లుగా పెండింగులో ఉండగా.. జ్యోతికృష్ణ డైరెక్షన్లో నటించిన ‘ఆక్సిజన్’ పరిస్థితి కూడా అయోమయంగా ఉంది. ఎ.ఎం.రత్నం ఉన్నాడు కాబట్టి ‘ఆక్సిజన్’ అయినా ఎలాగోలా బయటికి వస్తుందేమో కానీ.. బి.గోపాల్ సినిమా సంగతే ఎటూ తేలడం లేదు. ఆ మధ్య ఈ సినిమాను పున:ప్రారంభిస్తున్నట్లు.. ‘బలం’ అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తర్వాత దీని గురించి చర్చే లేదు.

ఐతే తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమాకు బడా ప్రొడ్యూసర్ పీవీపీ అండగా నిలుస్తున్నారట. ఈ సినిమాకు ఫైనాన్స్ ఏర్పాటు చేసి.. పెండింగ్ లో ఉన్న షూటింగ్ పూర్తి చేయడానికి ఆయన తోడ్పాటు అందిస్తున్నారట. కొన్ని రోజుల్లోనే ఆ మిగతా షూటింగ్ పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. ఈ చిత్రంలో గోపీ సరసన నయనతార కథానాయికగా నటించింది. ముందు భూపతి పాండ్యన్ అనే తమిళ దర్శకుడితో మొదలై.. ఆ తర్వాత బి.గోపాల్ చేతికి వచ్చిన ప్రాజెక్టు ఇది. మొదట్లో దీనికి ‘జగన్మోహన్ ఐపీఎస్’ అనే పేరు పెట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News