బాహుబలి' తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పిలవబడే రాజమౌళి తన సినిమాని ప్రమోట్ చేయడానికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలతో వస్తుంటారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' కోసం జక్కన్న ప్లాన్ చేస్తున్న ప్రమోషనల్ స్ట్రాటజీలు మార్కెటింగ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. అక్టోబరు 29న వరల్డ్ సినిమాలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని కొలాబరేషన్ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ RRR టీమ్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు శుక్రవారం బిగ్గెస్ట్ కొలాబరేషన్ ఏంటో రివీల్ చేశారు.
''ఆర్ ఆర్ ఆర్'' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ సినిమాస్ తో చేతులు కలిపింది. ఈరోజు ముంబైలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. PVR యాజమాన్యంతో పాటుగా రాజమౌళి - డీవీవీ దానయ్య - కార్తికేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపై సినిమా రిలీజ్ అయ్యే వరకు దేశవ్యాప్తంగా ఉన్న తమ 850పైగా థియేటర్లలో పీవీఆర్ ''RRR'' చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంది. అంతేకాదు ఈ మేరకు PVR తన పేరును ''PVRRR'' గా మార్చుకుంది.
ఈ విషయాన్ని ట్రిపుల్ ఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. భారతీయ సినిమా వైభవం కోసం ఇండియాలోని రెండు బిగ్గెస్ట్ ఫోర్సెస్ RRR - PVR చేతులు కలుపుతున్నాయి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ''RRR కోసం PVR తమ బ్రాండ్ నేమ్ ను మార్చుకుంది. సినిమా కోసం ఒక బ్రాండ్ తమ పేరునుమార్చుకోవడం ప్రపంచంలోనే తొలిసారి. భారతదేశం అంతటా 850+ స్క్రీన్ లు మరియు 70+ నగరాల్లో 170+ ప్రాపర్టీలలో రాబోయే కొన్ని నెలలపాటు ఇది 'PVRRR' గా సూచించబడుతుంది'' అని చిత్ర బృందం తెలిపింది.
కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథాంశంతో 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్ - భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్ - ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ - సముద్ర ఖని - శ్రీయా శరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రచార కార్యక్రమాలను జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి. దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాని గ్రాండ్ గా రిలీజ్ కానుంది.