మూర్తి గారి సినిమాకు సెన్సార్ క్లియర్

Update: 2018-05-07 05:39 GMT
ఒక్కో నటుడు తన నట జీవితంలో పలు రకాల క్యారెక్టర్లు.. థీమ్ లను ట్రై చేయాలని భావిస్తారు. మేకర్స్ కూడా అలాగే ఆలోచిస్తారు. కానీ మేకర్ కం లీడ్ క్యారెక్టర్ అన్నీ తానే అయి సినిమాలను తీసే ఆర్ నారాయణ మూర్తి మాత్రం ఎప్పడూ ఒకటే థీమ్ కు స్టిక్ అయిపోయి ఉంటారు. ఒక్క హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మినహాయిస్తే.. నారాయణ మూర్తి చేసిన తీసిన సినిమాలు అన్నీ పోరాటాల ఆధారంగానే ఉంటాయి.

 విప్లవ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈయన.. అన్నదాత సుఖీభవ అంటూ ఓ సినిమాను తీసి చాలాకాలం అయింది. కానీ దీనికి సెన్సార్ ప్రాబ్లెమ్స్ ఎదురయ్యాయి. ఇందుకు కారణం.. ఈ సినిమాలో రైతుల ఆత్మహత్యలు.. డిమానిటైజేషన్.. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే బిజినెస్ మ్యాగ్నెట్స్.. వంటి అంశాలను స్పృశించారు. దీంతో అన్నదాత సుఖీభవ చిత్రానికి అనేక కట్స్ సూచించింది సెన్సార్ బోర్డ్. ఈ అంశాలను తీసేస్తే అసలు సినిమాకే అర్ధం ఉండదని ఫీలయిన నారాయణమూర్తి.. రివైజింగ్ కమిటీకి అప్లై చేసుకుని సినిమాకు క్లియరెన్స్ తెచ్చుకున్నారు.

 ఈ విషయంలో తన సినిమాకి సహకరించిన సెన్సార్ సభ్యురాలు జీవిత.. సెన్సార్ ఆఫీసర్ రాజశేఖర్ లకు కృతజ్ఞతలు తెలిపిన నారాయణ మూర్తి.. అన్నదాత సుఖీభవ చిత్రాన్ని జూన్ 1వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 'దేశవ్యాప్తంగా రైతులు జూన్ 1 నుంచి 10 వరకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. నగరాలకు పాలు, కూరగాయలు సప్లై చేయకూడదని నిర్ణయించుకున్నారు. నా సినిమా కూడా రైతుల కష్టాలపైనే ఉంటుంది. అందుకే ఇదే సమయంలో మూవీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం' అన్నారు ఆర్ నారాయణ మూర్తి.


Tags:    

Similar News