ఎర్రన్న వదులుకున్నవి ఏంటో తెలిస్తే షాక్‌ అవుతారు

Update: 2019-06-02 09:42 GMT
టాలీవుడ్‌ లో ఆర్‌ నారాయణ మూర్తికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా సమస్యలపై సినిమాలు తీస్తూ పీపుల్స్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్న ఆర్‌ నారాయణ మూర్తి ఒకానొక సమయంలో దాదాపు వరుసగా 15 సినిమాలు సక్సెస్‌ అవ్వడంతో కోట్ల రూపాయలు ఆయనకు దక్కాయి. కాని ఆ డబ్బు మొత్తం కూడా ప్రజాసేవకే ఎర్రన్న ఉపయోగించాడు. ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాలు చేసిన ఎర్రన్న ఈమద్య కాలంలో ఎక్కువగా సక్సెస్‌ లు దక్కించుకోలేక పోతున్నాడు.

ఆయన తీస్తున్న సినిమాలతో సక్సెస్‌ లు రాకున్నా.. ఆయన తల్చుకుంటే ఎంత పెద్ద స్టార్‌ హీరో సినిమాలో అయినా అవకాశం దక్కించుకోగలడు. కోట్లల్లో పారితోషికం ఇచ్చేందుకు కూడా దర్శక నిర్మాతలు సిద్దంగా ఉంటారు. కాని ఆయన మాత్రం అలాంటి కమర్షియల్‌ పాత్రలకు ఒప్పుకోవడం లేదు. సినిమాల్లో ఆఫర్లు మాత్రమే కాకుండా నారాయణ మూర్తి ఇంకా చాలా వదులుకున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

వైఎస్సార్‌ అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్‌ లో ఇంటి స్థలంతో పాటు వైజాగ్‌ లో 10 ఎకరాల భూమిని ఆఫర్‌ చేశారట. కాని ఎర్రన్న మాత్రం దాన్ని సున్నితంగా తిరష్కరించాడట. ఆ తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇస్తామని ముందుకు వచ్చినా కూడా దానికి నో చెప్పాడట. ఇప్పటి వరకు సొంత ఇల్లు అంటూ లేని ఎర్రన్నకు ప్రభుత్వం నుండి పలు ఆఫర్లు వచ్చినా కూడా నో చెప్పాడట.

ఇక రాజకీయంగా కూడా ఆర్‌ నారాయణ మూర్తికి ఛాన్స్‌ దక్కిందట. గతంలో వైఎస్సార్‌ ఉన్న సమయంలో కాంగ్రెస్‌ నుండి ఎర్రన్నకు కాకినాడ సీటు ఆఫర్‌ చేయడంతో పాట - చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో కూడా ఆర్‌ నారాయణ మూర్తిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తుని  సీటును నారాయణ మూర్తికి వైకాపా ఆఫర్‌ చేసిందట. కాని ఆయన మాత్రం రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. మొత్తానికి పలు ఆఫర్లను వదులుకున్న నారాయణ మూర్తి నిజంగా పీపుల్స్‌ స్టార్‌ అనిపించుకున్నాడు.

Tags:    

Similar News