యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''మాచర్ల నియోజకవర్గం''. ఇందులో కృతి శెట్టి - కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించగా.. అంజలి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'మాచర్ల యాక్షన్ ధమ్కీ' మరియు పవర్ ప్యాక్డ్ ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలానే 'రారా రెడ్డి' అనే స్పెషల్ సాంగ్ ఉర్రూతలూగించింది.
'రారా రెడ్డి.. ఐ యామ్ రెడీ' అంటూ సాగే ఈ పాటలో నితిన్ మరియు అంజలిల ఊర మాస్ స్టెప్పులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో 'రాను రాను అంటూనే చిన్నదో' అంటూ 'జయం' సాంగ్ బీట్ ని చేర్చడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
'రారా రెడ్డి' సాంగ్ మిలియన్ల వ్యూస్ తో అన్ని సోషల్ మీడియా మరియు అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫారమ్ లను షేక్ చేసింది. 3.6 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇకపోతే 'రారా రెడ్డి.. ఐ యామ్ రెడీ' పాట అన్ని షార్ట్ వీడియో యాప్ లలో 500 మిలియన్లకు పైగా వ్యూస్ తో మాచర్ల మాస్ మేనియా ఎలా ఉందో చూపించిందని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
మెలోడీ స్పెషలిస్ట్ మహతి స్వర సాగర్ ఈ పాటకు మాంచి మాస్ ట్యూన్ ను కంపోజ్ చేయగా.. గాయని లిప్సిక తన వాయిస్ తో మరింత ప్రత్యేకంగా మార్చింది. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.
'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి.. డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. కామెడీ - యాక్షన్ - రొమాన్స్.. ఇలా అన్ని కమర్షియల్ అంశాలతో మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో సిద్ధార్థ్ రెడ్డి అనే కలెక్టర్ పాత్రలో నితిన్ కనిపించనున్నారు. సముద్రఖని - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - ఆమని - మురళీ శర్మ - జయప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు సోదరి నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. మామిడాల తిరుపతి డైలాగ్స్ రాశారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేశారు.
''మాచర్ల నియోజకవర్గం'' చిత్రాన్ని ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పక్కా మాస్ మూవీతో రాబోతోన్న నితిన్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.Full View
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'మాచర్ల యాక్షన్ ధమ్కీ' మరియు పవర్ ప్యాక్డ్ ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలానే 'రారా రెడ్డి' అనే స్పెషల్ సాంగ్ ఉర్రూతలూగించింది.
'రారా రెడ్డి.. ఐ యామ్ రెడీ' అంటూ సాగే ఈ పాటలో నితిన్ మరియు అంజలిల ఊర మాస్ స్టెప్పులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో 'రాను రాను అంటూనే చిన్నదో' అంటూ 'జయం' సాంగ్ బీట్ ని చేర్చడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
'రారా రెడ్డి' సాంగ్ మిలియన్ల వ్యూస్ తో అన్ని సోషల్ మీడియా మరియు అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫారమ్ లను షేక్ చేసింది. 3.6 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇకపోతే 'రారా రెడ్డి.. ఐ యామ్ రెడీ' పాట అన్ని షార్ట్ వీడియో యాప్ లలో 500 మిలియన్లకు పైగా వ్యూస్ తో మాచర్ల మాస్ మేనియా ఎలా ఉందో చూపించిందని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
మెలోడీ స్పెషలిస్ట్ మహతి స్వర సాగర్ ఈ పాటకు మాంచి మాస్ ట్యూన్ ను కంపోజ్ చేయగా.. గాయని లిప్సిక తన వాయిస్ తో మరింత ప్రత్యేకంగా మార్చింది. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.
'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి.. డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. కామెడీ - యాక్షన్ - రొమాన్స్.. ఇలా అన్ని కమర్షియల్ అంశాలతో మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో సిద్ధార్థ్ రెడ్డి అనే కలెక్టర్ పాత్రలో నితిన్ కనిపించనున్నారు. సముద్రఖని - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - ఆమని - మురళీ శర్మ - జయప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు సోదరి నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. మామిడాల తిరుపతి డైలాగ్స్ రాశారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేశారు.
''మాచర్ల నియోజకవర్గం'' చిత్రాన్ని ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పక్కా మాస్ మూవీతో రాబోతోన్న నితిన్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.