చేయని తప్పుకు సారీ చెప్పిన హీరొయిన్

Update: 2019-05-18 05:34 GMT
అసలు ఈ 4జి టెక్నాలజీ స్మార్ట్ ఫోన్లు ఇంటర్ నెట్ సోషల్ మీడియా వగైరాలు లేకపోతే ప్రపంచం నడుస్తుందా అనే సందేహం వస్తుంది కదూ. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. దీని వల్ల ఎక్కువగా ప్రభావితం చెందేది సినిమా పరిశ్రమే. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా ఆ ఇష్యూ లో మన ప్రమేయం ఉన్నప్పుడు సారీ చెప్పే పరిస్థితి రావొచ్చు.. అలాంటి అనుభవమే రాశి ఖన్నాకు ఎదురైంది.

ఇటీవలే తమిళ్ లో విడుదలైన విశాల్ అయోగ్యలో రాశి ఖాన్న హీరొయిన్ గా నటించింది. తన పాత్రకు ఎస్ఆర్ రవీనా అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతు అరువిచ్చింది. మంచి రెస్పాన్స్ కూడా దక్కింది. అయితే ఎండ్ క్రెడిట్స్ లో వ్యాన్ డ్రైవర్లు మెస్ స్టాఫ్ తో సహా అందరి పేర్లు వేసిన అయోగ్య టీం ఈ డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లను మాత్రం మర్చిపోయింది

ఫలితంగా రవీనా ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేసింది. తమ విభాగాన్ని నిర్లక్ష్యం చేసినందుకు విచారంగా ఉందని అయినా మిగిలిన డిపార్ట్ మెంట్లలోని వ్యక్తులను ప్రస్తావించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనికి రాశి ఖాన్న స్పందిస్తూ సారీ చెప్పింది. నీ గొంతు వల్లే తన నటన మరింత అందంగా స్క్రీన్ మీద కనిపించిందని మంచి భవిష్యత్తు ఉందని రీ ట్వీట్ చేసింది.

నిజానికి ఈ తప్పిదం దర్శక నిర్మాతలది. బాధ్యత వాళ్ళు వహించాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విశాల్ రెస్పాండ్ అవ్వాలి. హీరొయిన్ కు ఏ మాత్రం సంబంధం లేని విషయం. అయినా ఊరట కోసం రాశి ఖన్నా సదరు డబ్బింగ్ ఆర్టిస్టుకి క్షమాపణ చెప్పడం మంచి విషయమే.


Tags:    

Similar News