శంకరాభరణం ప్రమోషన్స్ కోసం కోన వెంకట్ ఎన్నో మాటలు చెప్పాడు. ఈ ప్రచారంలో భాగంగా మాటీవీ నిర్వహించే "మా టాకీస్" అనే కార్యక్రమానికి కూడా వెళ్లి.. చాలానే పొగిడేశారు సినిమాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే హోస్ట్ మాజీ హీరోయిన్ రాశి.. ఒక విషయంలో మాత్రం డౌట్ వ్యక్తపరిచింది. అదే ఆ టైటిల్ గురించే.
మాటల్లో భాగంగా శంకరాభరణం లాంటి క్లాసిక్ పేరు చెడగొట్టినా, సినిమా తేడా వచ్చినా.. చాలా మంది అభిమానులు హర్టవుతారు అంటూ చెప్పిన కోన వెంకట్.. తన ఇల్లు ఎక్కడ అని వెతికొచ్చి కొట్టినా కొడతారు అని చెప్పాడు. వెంటనే అందుకున్న రాశి.. ఫస్టు ఆ లిస్టులో నేనే ఉంటా అంటూ నవ్వుతూ హింటిచ్చేసింది. మరిప్పుడు ఎలాగూ ఆ క్లాసిక్ పేరుకు న్యాయం చేయలేకపోయాడు గురుడు. పైగా పరువు తీశాడనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అసలు ఎక్కడో బిహార్ లో ఉన్న ఇంటికి.. శంకరాభరణం అనే పేరు ఎలా యాప్ట్ అవుతుందని అనుకున్నాడో అర్ధం కాదు. ఇది సరే కానీ.. మరిప్పుడు మాజీ హీరోయిన్ రాశి.. నిజంగానే కోన ఇల్లు వెతుక్కుంటూ వెళుతుందా??
ఆ రోజు ఆ మాట చెప్పిన కోన.. ఇంకోమాట కూడా చెప్పాడు.. ''ఈ మధ్యనే నా ఇల్లు అమెరికా కు మార్చేసా. సో.. కొట్టే ఛాన్సుండదలే'' అన్నాడు. కాబట్టి రాశి ఆశలన్నీ హుష్ కాకీ. ఇకపోతే ఈ జోకులన్నీ ఎలా ఉన్నా.. అదే కార్యక్రమంలో కోన ఏమన్నాడంటే.. సినిమా చివరాకర్లో ఇచ్చే మెసేజ్ చూసి ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారు అనేశాడు. దే..వు...డా!