బాలీవుడ్ లో ప్రతి ఈద్ కు ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుందని అందరికి తెలిసిందే. ఎవరు మిస్ అయినా కండల వీరుడు వీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం అస్సలు మిస్ అవ్వడు. ఈ ఏడాది ఈద్ కానుకగా రేస్ 3 సినిమాతో భారతీయ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో విడుదలైన ట్రైలర్ ద్వారా తెలిసిపోయింది. ఇంతకుముందు వచ్చిన కథలకంటే డిఫెరెంట్ గా అనిపించడంతో అభిమానులు ఆశలు చాలానే పెట్టుకున్నారు.
కానీ సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు భారీ స్థాయిలో అందాయి. ఓపెనింగ్ డే రేస్ 3 - 30 కోట్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ ఎనలిస్ట్ ల ప్రకారం తొలి వీకెండ్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 కోట్లను మొదటి వారంలో అందుకునే ఛాన్స్ ఉందని మరికొందరు వారి అంచనా ప్రకారం లెక్కలు వేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 3500 స్క్రీన్ లలో రిలీజ్ అయ్యింది కాబట్టి భారీ స్థాయిలో కలెక్షన్స్ అందే అవకాశం ఉంది.
అయితే సల్మాన్ గత చిత్రం టైగర్ జిందా హై 34.10 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ఆ సినిమా కంటే ఈ సినిమాకు ఎక్కువగా క్రేజ్ వచ్చింది అనుకున్నప్పటికీ తక్కువ కలెక్షన్స్ రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. మరి మొత్తంగా ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో చూడాలి. రెమో డి సౌజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ తో పాటు అనిల్ కపూర్ - జాక్వాలిన్ ఫెర్నాండేజ్ బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.