ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ తెరకెక్కించిన రాధేశ్యామ్ త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. తాజా సమాచారం మేరకు మోస్ట్ అవైటెడ్ రాధేశ్యామ్ డిజిటిల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ చేతికి వెళ్లనున్నాయి. శాటిలైట్ రైట్స్ జీ 5 దక్కించుకోనుందని తెలుస్తోంది. అయితే ఈ డీల్ తెలుగు వరుకు మాత్రమే.. హిందీ శాటిలైట్ హక్కుల్ని వేరే ఛానల్ వారు కొనే అవకాశం ఉంది.
ప్రతిష్ఠాత్మక రాధే శ్యామ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్ - జీ 5 వేదికలపై అభిమానులకు అందుబాటులోకి రానుంది. రాధే శ్యామ్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుండగా తెలుగు- తమిళం- కన్నడ- మలయాళం వెర్షన్లు జీ 5 లో ప్రసారం కానున్నాయి. జీ 5 మల్టీ లింగువల్ వెర్షన్లను ఎంచుకోవడం ఇదే మొదటిసారి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం దక్కింది. జీ నెట్ వర్క్ తన మార్కెట్ ను దక్షిణాదిలో దూకుడుగా విస్తరిస్తోందని దీనిని బట్టి అర్థమవుతోంది. ఆసక్తికరంగా ఆర్.ఆర్.ఆర్ మూవీ డిజిటల్ శాటిలైట్ హక్కుల్ని ఇదే ఫార్మాట్ లో అమ్మారు. ఆర్.ఆర్.ఆర్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ కు.. ఇతర భాషలను జీ5 కి విక్రయించారు.
ఇక రాధేశ్యామ్ థియేట్రికల్ రిలీజ్ గురించిన సమాచారం రిలీజ్ తేదీ అప్ డేట్ ఇంకా రావాల్సి ఉంది. కరోనా క్రైసిస్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ ఫార్మాట్ పూర్తిగా మారిపోయింది. ఆ ప్రభావం రాధేశ్యామ్ పైనా తీవ్రంగా పడిందని తాజా డీల్ వెల్లడిస్తోంది. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ నిర్మించగా హిందీ వెర్షణ్ ని టీసిరీస్ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది.