ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి షూటింగ్ యూరప్ లో చిత్రీకణ జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ కారణంగా ఇండియాకు వచ్చేశారు. మళ్లీ ఇప్పట్లో యూరప్ వెళ్లే అవకాశం లేదనుకున్న యూనిట్ సభ్యులు బ్యాలన్స్ షూట్ మొత్తం హైదరాబాద్ లో చేసేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి సెట్స్ కూడా వెయిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. యూరప్ కు సంబంధించిన పలు సెట్టింగ్స్ ను హైదరాబాద్ లో క్రియేట్ చేస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. కాని పరిస్థితులు మెల్లగా కుదుట పడుతున్న నేపథ్యంలో మళ్లీ యూరప్ వెళ్లి అక్కడ షూటింగ్ చేసుకుని రావాలని రాధేశ్యామ్ టీం నిర్ణయించుకున్నారట.
రాధేశ్యామ్ షూటింగ్ కోసం యూరప్ లోని ఇప్పటికే పలు లొకేషన్స్ ను అనుకున్నారు. అక్కడకు వెళ్లేందుకు వీసా పర్మీషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా కాస్త కష్టంగా వీసా అనుమతులు వస్తున్నాయి. ప్రత్యేక విమానంలో యూనిట్ సభ్యులు అంతా కూడా యూరప్ వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను యూవీ నిర్మాతలు చూస్తున్నారు. అక్టోబర్ రెండవ లేదా మూడవ వారంలో యూరప్ షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లో నటిస్తుంది. అప్పటి వరకు ఆ సినిమాను పూర్తి చేసి రాధేశ్యామ్ కు డేట్లు కేటాయించనుంది. దాదాపు నెలన్నర రోజుల పాటు చిత్రీకరణ చేసే అవకాశం ఉందని అంటున్నారు.