దేశవ్యాప్తంగా కరోనా మరియు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. గత రెండేళ్లలో ఎదుర్కొన్న సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీంతో పాన్ ఇండియా సినిమాల విడుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్' మూవీ వాయిదా పడగా.. ఇప్పుడు 'రాధేశ్యామ్' కూడా అదే దారిలో నడవడానికి సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ''రాధే శ్యామ్''. సంక్రాంతి కానుకగా జనవరి 14న భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు సినిమాల రిలీజులకు పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే మేకర్స్ ఇప్పటికి రెండుసార్లు వీటిని కొట్టిపడేసారు. కానీ ఈసారి మాత్రం వాయిదా పక్కా అనేది తాజా సమాచారం.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ పెట్టడంతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రదర్శించాలని ఆంక్షలు విధించారు. కేరళ - తమిళనాడు -
మహారాష్ట్ర - కర్ణాటక లలో ఈ విధంగానే సినిమాలు నడుస్తున్నాయి. ఇక బీహార్ - పశ్చిమ బెంగాల్ - న్యూఢిల్లీ రాష్ట్రాలు థియేటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రాణాలను రిస్క్ లో పెట్టి సినిమాలు చూడటానికి జనాలు థియేటర్లకు రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలను విడుదల చేయడం అంటే కోరి నష్టాలను కొని తెచ్చుకున్నట్లే అని 'రాధే శ్యామ్' మేకర్స్ వాయిదా నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. ఈరోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
అయితే 'రాధే శ్యామ్' ను సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. పరిస్థితులు సానుకూలంగా ఉంటే మార్చి 18న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని కూడా పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రావాలని యోచిస్తున్నట్లు టాక్. ఇదే జరిగితే సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే రెండు భారీ సినిమాలు సమ్మర్ లో అలరిస్తాయని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
కాగా, 'రాధే శ్యామ్' చిత్రాన్ని యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ మరియు ప్రసీద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీలో టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.