ఇప్పుడు ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో చాలామంది హీరోయిన్లు గళం విప్పుతున్నారు కానీ.. రాధికా ఆప్టే కొన్నేళ్ల కిందటే తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చింది. ఓ దక్షిణాది సీనియర్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం వెల్లడించింది. అలాగే సినీ పరిశ్రమలో మహిళల పట్ల వివక్ష గురించి కూడా ఆమె ఓపెన్ గా మాట్లాడింది. ఇటీవలే ఊపందుకున్న ‘మీ టూ’ ఉద్యమానికి కూడా ఆమె మద్దతుగా నిలిచింది.
ఐతే ఓ వైపు ‘మీ టూ’కు సపోర్ట్ ఇస్తూనే.. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ మేనేజ్మెంట్ సంస్థ ‘క్వాన్’తో రాధిక బంధాన్ని కొనసాగిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సంస్థలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అతడికి వ్యతిరేకంగా నలుగురు అమ్మాయిలు తీవ్ర ఆరోపణలు చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కారణంగా బాలీవుడ్లో ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ‘హౌస్ ఫుల్-3’.. ‘మొఘల్’.. ‘సూపర్ 30’ లాంటి సినిమాలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ‘క్వాన్’ నుంచి కూడా కొందరు సెలబ్రెటీలు తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ రాధిక మాత్రం ఆ సంస్థతో బంధం తెంచుకోనంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు ఉంటాయని సంస్థ హామీ ఇచ్చిందని.. ఆ సంస్థ పరిధిలో ఇకపై మహిళలకు ఎలాంటి సమస్యలు ఉండవని యాజమాన్యం హామీ ఇచ్చిందని.. ఆ సంస్థ ప్రతినిధులతో తనకు మంచి అనుబంధం ఉందని.. వాళ్లతో తనకెలాంటి ఇబ్బందులూ ఎదురు కాలేదని.. అలాంటపుడు దాన్నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఏముందని రాధిక ప్రశ్నిస్తోంది. కొన్నేళ్లుగా రాధికకు సంబంధించిన సినిమా, వాణిజ్య ఒప్పందాల వ్యవహారాల్ని ఈ సంస్థే చూస్తోంది.