రాధికా ఆప్టే అనగానే ఆమె నటించిన లెజెండ్.. లయన్ సినిమాల కంటే కూడా ఆమె తెలుగు పరిశ్రమ గురించి వేసిన సెటైర్లే గుర్తుకొస్తాయి. టాలీవుడ్లో హీరోయిన్లకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరని.. హీరోలకు ఇచ్చే ట్రీట్మెంట్ హీరోయిన్లకు ఉండదని.. వాళ్లను చిన్న చూపు చూస్తారని.. ఇకపై తెలుగులో సినిమాలు చేసే అవకాశమే లేదని ఆ మధ్య రాధిక సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ‘లయన్’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని దక్షిణాదిన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కబాలి’లో నటించింది రాధిక.
ఈ సందర్భంగా రజినీతో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనతో సినిమా చేయడం గొప్ప అనుభవం. రజినీ సార్ నిజంగా స్ఫూర్తి కలిగించే గొప్ప వ్యక్తి. ఎంతో నిబద్ధతతో పన చేస్తారు. ఆయన ఎంత వినమ్రంగా ఉండేవారో మాటల్లో చెప్పలేను. నేను తొలిసారి షూటింగ్ కి వెళ్లినపుడు ఆయన నాకోసం బయట వెయిట్ చేసిన విషయాన్ని మరిచిపోలేను. ఇలా ఇంకే స్టార్ అయినా చేస్తారా? ఆయనే కాదు.. కబాలి షూటింగ్ సందర్భంగా అందరూ నన్ను బాగా చూసుకున్నారు’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రాధిక. ఐతే రజినీ తనను రిసీవ్ చేసుకున్న తీరు.. కబాలి టీం తనను చూసుకున్న తీరు గురించి రాధిక చెబుతుంటే మన పరిశ్రమ మీద సెటైర్లు వేసినట్లుగా ఉంది.
ఇక ‘కబాలి’లో అవకాశం ఎలా దక్కిందో చెబుతూ.. ‘‘నిజానికి నాకు.. కబాలి టీంకు మధ్య మధ్యవర్తులెవ్వరూ లేరు. దర్శకుడు రంజిత్ నేరుగా నాకే ఫోన్ చేసి రజినీకాంత్ సినిమాలో చేస్తారా అని అడిగాడు. కథ వినడానికి చెన్నై రమ్మన్నాడు. నా క్యారెక్టర్ బాగా నచ్చింది. పైగా రజినీకాంత్ కు నేను పెద్ద ఫ్యాన్. అందుకే మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకున్నా’’ అని రాధిక చెప్పింది. రజినీ బేసిగ్గా మరాఠీయుడు కావడంతో తామిద్దరం మరాఠీలోనే మాట్లాడుకునేవాళ్లమని ఆమె వెల్లడించింది.