న్యూడ్ వీడియోలపై రాధికా భ‌లే వెరైటీగా..

Update: 2016-08-26 15:30 GMT
తనకు సంబంధించిన న్యూడ్ వీడియోలు ఒకదాని తర్వాత విడుదలవుతుండటం యాదృచ్ఛికంగానే జరుగుతోందని.. అందులో తన ప్రమేయం ఏమీ లేదని అంటోంది రాధికా ఆప్టే. తన వరకు అలాంటి సన్నివేశాల్లో నటించడంలో ఎలాంటి ఇబ్బందీ లేదని.. తన బాడీ అలాంటి సన్నివేశాలకు సౌకర్యంగానే ఉంటుందని ఆమె తనదైన శైలిలో బదులిచ్చింది. ఆ వీడియోలు ఎవరు లీక్ చేశారో తనకు తెలియదని.. ముందు ఇలా వీడియోలు లీకైనపుడు కోపం వచ్చినా.. తర్వాత నవ్వుకున్నానని ఆమె వ్యాఖ్యానించింది.

‘‘ఆ సీన్లు చేసేటప్పుడు నేను చాలా సౌకర్యంగానే ఉన్నాను. కాబట్టి ఆ సీన్లు చేసినందుకు నేనెందుకు ఫీలవ్వాలి. వీడియో లీకైనప్పుడు ఓ జర్నలిస్టు.. పదే పదే నా వీడియోలే ఎందుకు లీకవుతున్నాయి అనడిగాడు. నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నించాడు. నేను అతడికి ఏం సమాధానం చెప్పలేదు. నాలో నేను ఆలోచించుకున్నానంతే. నా వీడియోలే ఎందుకు లీకవుతున్నాయంటే.. నేను ఆ సీన్లలో చేస్తున్నాను కాబట్టే. ఒక మగాడు.. ఒక ఆడది న్యూడ్ సీన్లలో నటించేటప్పుడు దృష్టంతా ఆడదానిమీదే మీదే ఉండటం సహజం. ఐతే న్యూడ్ సీన్ అనేది ఆ సినిమాకు ఎంత వరకు అవసరం.. సినిమాలో దాని ప్రాధాన్యం అనేది నాకు తెలుసు. పొట్టి బట్టలేసుకుని కెమెరా ముందు డాన్సులేసి జనాలకు చూపెట్టడం అనేది అసభ్యత కావచ్చు కానీ ఓ కళగా చూస్తే నేను చేసింది అసభ్యతగా అనిపించకపోవచ్చు. అలాంటి సీన్లు చేయడంలో నాకు ఇబ్బంది లేదు. నా శరీరానికి అందుకు సౌకర్యంగానే ఉంటుంది’’ అని కుండబద్దలు కొట్టింది రాధిక.
Tags:    

Similar News