నాని హీరోగా తెరకెక్కి - భారీ అంచనాల నడుమ విడుదలైన 'జెర్సీ' చిత్రంకు పాజిటివ్ టాక్ దక్కింది. అదే రోజు విడుదలైన 'కాంచన 3' కి మాత్రం పెద్దగా స్పందన దక్కలేదు. ఏ సెంటర్ లలో జెర్సీ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుంటే బి మరియు సి సెంటర్లలో మాత్రం జెర్సీని మించి 'కాంచన 3' వసూళ్లు దక్కించుకుంటుంది. 'కాంచన 3' అనుకున్న వసూళ్ల కంటే ఎక్కువగా రాబడుతున్నట్లుగా బయ్యర్లు అంటున్నారు. వచ్చిన టాక్ కు వస్తున్న కలెక్షన్స్ కు సంబంధం లేకుండా ఉందని టాలీవుడ్ వర్గాల వారు కూడా అంటున్నారు.
'కాంచన 3'ని తెలుగు రాష్ట్రాల బి - సి ప్రేక్షకులు బాగా ఆధరిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాంచన 3కి వస్తున్న ఆధరణకు చాలా సంతోషంగా ఉందన్న లారెన్స్ అదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సాదారణంగా ఒక సినిమా హీరో మరో సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడేందుకు తక్కువ ఆసక్తి చూపుతారు. అలాంటిది తన సినిమాకు పోటీగా వచ్చిన సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో పాటు తప్పకుండా ఆ సినిమాను చూడండి అంటూ చెప్పడం జరగదు.
కాని తాజాగా 'కాంచన 3' థ్యాంక్స్ మీట్ లో లారెన్స్ మాట్లాడుతూ నిన్న రాత్రి 'జెర్సీ' సినిమా చూశాను. చాలా బాగుంది - అద్బుతమైన సినిమా అంటూ ప్రశంసలు కురిపించాడు. తప్పకుండా ఆ సినిమాను కూడా చూడండి అంటూ ప్రేక్షకులను కోరాడు. లారెన్స్ చేసిన వ్యాఖ్యలకు అంతా కూడా శభాష్ అంటున్నారు. నీలాంటి వారు ఇండస్ట్రీలో ఉండాలని - స్వార్థంతో నా సినిమానే ప్రేక్షకులు చూడాలనుకునే వారు ఉంటే మంచి సినిమాలు రావు. మరోసారి తన మాటలతో లారెన్స్ గొప్పతనం చాటుకున్నాడని ఆయన అభిమానులు అంటున్నారు.