భిక్షాటన చేస్తున్న వారి దగ్గరకు కారు పంపి ఇంటికి తెప్పించి లారెన్స్
తమిళనాడులోని రాజపాళయంకు చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుక్కి చిత్రమైన వ్యాధి ఉండటం.. దాన్ని నయం చేసేందుకు అవసరమైన డబ్బులు లేకపోవటంతో.. నటుడు లారెన్స్ సాయం చేస్తారని తెలిసి సోదరుడితో పాటు చెన్నైకి వచ్చిన మహిళ ఉదంతం తెలిసిందే. చెన్నైకి వచ్చిన తర్వాత లారెన్స్ ఇంటికి ఎలా వెళ్లాలో తెలీక.. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేస్తున్న వైనం మీడియాలో రావటం.. సోషల్ మీడియాలో వైరల్ కావటం తెలిసిందే.
ఈ విషయం లారెన్స్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనకోసం చెన్నైకి వచ్చి ఇబ్బందులు పడుతున్న వారిని తన వద్దకు తీసుకురావాల్సిందిగా అనుచరుల్ని పంపారు. స్వయంగా తన కారులో తీసుకురావాలని కోరారు. లారెన్స్ పంపితే తాము వచ్చామన్న లారెన్స్ సిబ్బంది మాటలతో గృహలక్ష్మీతీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
వారిని సముద్ర తీరంలో ఉన్న లారెన్స్ ఇంటికి తీసుకెళ్లారు. వారు పడిన బాధలకు ఉద్వేగానికి గురైన లారెన్స్.. వారికొచ్చిన కష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా సాయం చేస్తానని చెప్పిన ఆయన.. ఎలాంటి చికిత్స అవసరమన్న విషయాన్ని తెలుసుకుంటామని.. తన ట్రస్ట్ ద్వారా సాయం చేస్తామని.. అది కూడా కాకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అయినా.. సాయం చేస్తానని మాట ఇచ్చారు. దీంతో.. వారు స్పందిస్తూ దేవుడే లారెన్స్ రూంలో వచ్చి తమ బిడ్డను ఆదుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు.