లారెన్స్‌ను గెలిపించిన అక్షయ్

Update: 2019-06-02 04:31 GMT
రాఘవ లారెన్స్ పంతం నెగ్గింది. బాలీవుడ్ నిర్మాతల నుంచి అతను కోరుకున్న గౌరవం దక్కింది. దీంతో అతను మనసు మార్చుకున్నాడు. ‘కాంఛన-3’ హిందీ రీమేక్ ‘లక్ష్మీబాంబ్’ను డైరెక్ట్ చేయడానికి అంగీకరించాడు. గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా.. తనకు మేకింగ్ టైంలో సరైన ప్రాధాన్యం దక్కకపోవడం, తనకు తెలియకుండా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతో మనస్తాపం చెందిన లారెన్స్ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను ఈ మేరకు ప్రకటన ఇచ్చాక కూడా నిర్మాతల నుంచి స్పందన లేదని.. కాబట్టి ఈ చిత్రంలో కొనసాగడం కష్టమని అతను సంకేతాలు ఇచ్చాడు.

ఈ లోపు ‘లక్ష్మీబాంబ్’కు రచయితగా పని చేస్తున్న ఫాహద్‌ను దర్శకుడిగా పెట్టుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కథ మారింది. చిత్ర నిర్మాతలు లారెన్స్‌ను కలిశారు. అతడితో సయోధ్య కుదుర్చుకుున్నారు. తన అభ్యంతరాల్ని చిత్ర బృందం విందని - తనకు తగిన గౌరవం ఇస్తామని చెప్పడంతో తాను ఈ సినిమాలో కొనసాగడానికి అంగీకరించానని లారెన్స్ స్వయంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా హీరో అక్షయ్ కుమార్‌ కు పెద్ద థ్యాంక్స్ చెప్పాడు లారెన్స్. దర్శకుడిని మార్చాలన్న నిర్ణయాన్ని అతను వ్యతిరేకించడమే కాక.. చెన్నై వెళ్లి లారెన్స్‌తో మాట్లాడాలని సూచించింది అక్షయేనట. ఇరువురితోనూ మాట్లాడి ఈ వివాదానికి సింపుల్‌గా ఫుల్ స్టాప్ పెట్టిన అక్షయ్‌ను అందరూ పొగిడేస్తున్నారు. మామూలుగా సౌత్ నుంచి రీమేక్ అంటే లోకల్ డైరెక్టర్లనే పెట్టుకుంటారు బాలీవుడ్ నిర్మాతలు. కానీ అక్షయే.. లారెన్స్‌తో సినిమా చేయాలని పట్టుబట్టి అతడిని పట్టుకెళ్లాడు. అందుకే తర్వాత కూడా మధ్యవర్తిత్వం వహించి అతను తిరిగొచ్చేలా చేశాడు.
 
Tags:    

Similar News