కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను ఆరంభించిన రాఘవ లారెన్స్ నటుడిగా మారి హీరోగా కూడా పలు సినిమాల్లో నటించాడు. హీరోగా నటిస్తున్న సమయంలోనే దర్శకత్వం వైపు కూడా అడుగులు వేశాడు. ఇప్పుడు కొరియోగ్రఫీని పూర్తిగా పక్కకు పెట్టి నటన మరియు దర్శకత్వంపై ఫోకస్ పెట్టాడు. హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా లారెన్స్ కు మంచి గుర్తింపు దక్కింది.
ప్రస్తుతం చంద్రముఖి 2 లో కూడా లారెన్స్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో రుద్రుడు అనే భారీ పాన్ ఇండియా మూవీ ని లారెన్స్ చేస్తున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా లో లారెన్స్ ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.
ఫస్ట్ లుక్ లో రాఘవ లారెన్స్ లుక్ చూస్తే షాకింగ్ గా ఉంది. ఆయన్ను ఇలా చూడటం విభిన్నంగా అనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కతిరేషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో లారెన్స్ నటుడిగా మరో పది మెట్లు పైకి ఎక్కడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు మొదటి నుండి నమ్మకంగా చెబుతున్నారు.
జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను ఈ ఏడాది డిసెంబర్ 23 న థియేటర్ల ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కరోనా ఇతర కారణాల వల్ల లారెన్స్ నుండి సినిమాకు కాస్త గ్యాప్ వచ్చింది. ఈ సినిమా ఆయన అభిమానులకు ఖచ్చితంగా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
సౌత్ లో అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ అన్ని భాషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేశారు. లారెన్స్ గతంతో పోల్చితే కాస్త ఫిజిక్ మార్చినట్లుగా ఈ లుక్ ను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రియా భవాణి శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటి నుండే లారెన్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి.