100 సినిమాలకు దర్శకత్వం వహించడం అంటే సాధారణమైన విషయం కాదని అందరికి తెలిసిందే. కానీ మన తెలుగు దర్శకులు ఆ రికార్డును చాలా ఈజీగా కొట్టేశారు. వారిలో కె. రాఘవేంద్రరావు ఒకరు. టాలీవుడ్ లో మూడు తరాల హీరోలతో సినిమాలను చేసిన దర్శకేంద్రుడు కొంత కాలంగా తన మేకింగ్ స్టైల్ ని మార్చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఎక్కువగా భక్తి రస చిత్రాలను తెరకెక్కించారు.
అయితే ఆయన కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమాలను ఎన్నో తీశారు. అలాగే తక్కువ బడ్జెట్ తో కూడా కొన్ని సినిమాలను తీశారు. ముఖ్యంగా పెళ్లి సందడి - బొంబాయి ప్రియుడు వంటి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినవి. అప్పట్లో యువ హీరోలుగా ఎదుగుతున్న శ్రీకాంత్ - జేడీ చక్రవర్తి వంటి వారితో సినిమాలను తెరకెక్కించి మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో తన దర్శకత్వ ప్రతిభను చూపించబోతున్నారట.
త్వరలోనే ఒక మంచి సబ్జెక్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా యువ నటీనటులతో సినిమాను చేయబోతున్నాడు. అంతే కాకుండా ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో ఉంటుందని సమాచారం. చివరగా రాఘవేంద్రరావు - నాగార్జున తో ఓం నమో వెంకటేశాయ సినిమాను చేశారు. ఆ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తన పాత ఫార్ములాను ఆయన వాడనున్నారని తెలుస్తోంది.