దర్శకేంద్రుడిని నష్టపరిచిన బాహుబలి?

Update: 2017-05-04 07:49 GMT
బాహుబలి మూవీ కారణంగా ఎవరైనా నష్టపోయారంటే.. వినేందుకు అది బండబూతులా ఉండొచ్చు. ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది బాహుబలి ది కంక్లూజన్. కానీ బాహుబలితో తాను నష్టపోయానంటున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తనకే కాదు.. నిర్మాతలు శోభు యార్లగడ్డ.. ప్రసాద్ దేవినేనిలకు కూడా ఈ చిత్రంతో నష్టాలు వచ్చాయంటున్నారు.

ఇప్పుడు భారీ వసూళ్లతో చరిత్ర సృష్టిస్తున్న చిత్రం బాహుబలి ది కంక్లూజన్. కానీ రాఘవేంద్రరావు నష్టాలు వచ్చాయని చెబుతున్నది బాహుబలి ది బిగినింగ్ గురించి. దేశంలోనే కాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచినా.. బాహుబలి పార్ట్ 1 తో మాత్రం నష్టాలకు గురయ్యామని అంటున్నారు. ఈ మూవీ అనూహ్యమైన వసూళ్లు సాధించి.. 125 కోట్ల వసూళ్లు సాధించినా తమకు మాత్రం లాస్ వచ్చిందన్నారు కేఆర్ ఆర్. బాహుబలి ది బిగినింగ్ తో అందరికంటే ఎక్కువగా పండగ చేసుకున్నది బయ్యర్స్ అనే విషయం తెలిసిందే.

పైగా తెలుగు వెర్షన్ కే నష్టాలు వస్తే.. దీన్ని జర్మన్.. మండేరియన్ భాషల్లోకి డబ్బింగ్ చేయగా.. అక్కడ ఫ్లాప్ కావడంతో నష్టాలు మరింతగా పెరిగాయన్నారు కే రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడి లాంటి దిగ్గజ డైరెక్టర్ అంత మాట అన్నారంటే.. అందులో కచ్చితంగా వాస్తవం ఉంటుందని అంటున్నారు సినీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News