స‌రిగ్గా ఇదే రోజున ఆ సినిమా కూడా...

Update: 2018-05-09 13:04 GMT
మ‌హాన‌టి విడుద‌లై హిట్ టాక్ తెచ్చుకుంది. అది సినిమా కాదు జీవితం అన్నంతంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిభ చూపించారు నాగ అశ్విన్‌. తెలుగు తెర‌ను ఏలిన ఒక మ‌హాన‌టి జీవితంలో జ‌రిగిన ఆటుపోట్ల‌ను అందంగా మ‌న‌సుకు హ‌త్తుకునే విధంగా తెర‌కెక్కించార‌ని ప్ర‌శంసిస్తున్నారంద‌రూ. మ‌హాన‌టి విడుద‌లైన ఇదే రోజున అంటే మే 9న‌ ... 28 ఏళ్ల క్రితం మ‌రో సూప‌ర్ హిట్ సినిమా కూడా విడుద‌లైంది. ఆ సినిమాను ఓసారి త‌ల‌చుకున్నారు మ‌న ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రుడు.

తెలుగు తెర‌ను ఊపేసిన సినిమాల్లో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమా కూడా ఒక‌టి. ఆ సినిమాకు రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అశ్వ‌నీ ద‌త్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. చిరంజీవిని శ్రీదేవిని సినీ అభిమానుల‌కు ఆరాధ్య దేవ‌త‌లుగా మార్చిన సినిమా అది. ఆ చిత్రం కూడా అప్ప‌ట్లో మే9నే విడుద‌ల చేశారు. ఆ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌ లో రాఘ‌వేంద్ర‌రావు ఓ సారి త‌ల‌చుకున్నారు. ఇర‌వై ఎనిమిది ఏళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజున భారీ వ‌ర్షం...చాలా పెద్ద సినిమా తీశాము అనే ఆనందం... ఎలా ఆడుతుందో అనే భ‌యం.. ఎప్పుడు వ‌ర‌ద ఆగుతుందో అని ఎదురు చూపు అని ట్వీట్ చేశారు. ఎట్ట‌కేల‌కు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జ‌నం క‌దిలారు... మ‌రుస‌టి రోజు నుంచి వర‌ద థియేట‌ర్ల‌లో అభిమానుల రూపంలో రావ‌డం మొద‌లైంది... అని ట్వీటులో పేర్కొన్నారు.  

మ‌రొక ట్వీటులో మా ద‌త్తుగారికి (అశ్వ‌నీ ద‌త్‌) ఆ రోజు ఎంత ఆనందం వేసిందో ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేను. అదే రోజున నేడు మ‌హాన‌టి విడుద‌ల‌యింది. ఆ రోజున జ‌గ‌దేక వీరుడు నిర్మించ‌డానికి ఎంత ధైర్యం కావాలో నేడు మ‌హాన‌టి నిర్మించ‌డానికి కూడా అంతే ధైర్యం కావాలి  అని పేర్కొన్నారు. ఇంకో ట్వీటు చేస్తూ మ‌హాన‌టిలో న‌టించిన వారిని ద‌ర్శ‌కుడినీ మెచ్చుకున్నారు. కీర్తి సురేష్ పాత్ర‌లో జీవించింద‌నీ ప్ర‌శంసించారు.
Tags:    

Similar News