జనరేషన్ గ్యాప్ అనే మాట ఎవ్వరికైనా వర్తిస్తుందేమో కానీ, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి మాత్రం అస్సలు వర్తించదు. ఎన్టీఆర్ - ఏఎన్నార్ లాంటి కథానాయకులతో సినిమాలు చేసిన ఆయన అల్లు అర్జున్ - నితిన్ లాంటి లేటెస్ట్ హీరోలతోనూ చిత్రాల్ని తెరకెక్కించిన ఘనత ఆయనది. నిన్నటితరం దర్శకులంతా కనుమరుగైపోతుంటే రాఘవేంద్రరావు మాత్రం ఇప్పటికీ కుర్ర దర్శకులతో పోటీపడుతూ సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునతో `ఓం నమో వేంకటేశాయ` చిత్రం తీస్తున్న ఆయన మరో భారీ ప్రాజెక్టుకి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
తన శిష్యుడు రాజమౌళి తరహాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. అది రెండేళ్ల తర్వాత మొదలయ్యే అవకాశాలున్నాయనీ, అందులో ఎన్టీఆర్ నటించొచ్చని ప్రచారం సాగుతోంది. సాంకేతికత అంతగా అందుబాటులో లేని సమయంలోనే `జగదేకవీరుడు అతిలోకసుందరి`లాంటి కళాఖండాన్ని తెరకెక్కించారు రాఘవేంద్రరావు. ఇక ఇప్పుడున్న టెక్నాలజీతో ఆయన ఇంకెంత మంచి సినిమాని తీస్తారో ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని, అదొక పౌరాణిక చిత్రం అయినా ఆశ్చర్యపోనవసరం లేదనేది ఫిల్మ్‌నగర్ మాట. మరి ఈ విషయంపై రాఘవేంద్రుడు ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.