సూది మందు అంటేనే కొందరు భయపడిపోతుంటారు. కళ్లు పక్కకు తిప్పేసుకోవడం లేదా కళ్లు మూసుకుని ఆ కాసేపు ఇంజక్షన్ పూర్తయ్యేవరకూ విలవిలలాడిపోవడం వగైరా వగైరా ఎపిసోడ్స్ చూసేవే. ఇక్కడ రత్తాలు అలియాస్ రాయ్ లక్ష్మి పరిస్థితి కూడా అందుకు మినహాయింపేమీ కాదు.
నర్స్ అలా వ్యాక్సిన్ వేసేందుకు తన చేతికి సూది గుచ్చుతుంటే ఎలా విలవిలలాడిపోతోందో చూశారు కదా.. చిన్నపిల్లలా భయపడి చస్తోంది. అసలు వద్దు బాబోయ్ అని మారాం చేస్తోంది. అయితే ఇంతలోనే చాకచక్యంగా వ్యాక్సినేషన్ ని పూర్తి చేశారు నర్స్. థాంక్ గాడ్..!
నాకు నిజంగా ట్రిపనోఫోబియా(సూది అంటేనే భయం) ఉంది !!! ఇంజెక్షన్ తీసుకోడం నాకు పెద్ద విషయం .. కానీ నేను ఎట్టకేలకు ఆ పని చేసాను .. అవును.. (నవ్వకండి) అని వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్ చేయించుకున్న వీడియోని రాయ్ లక్ష్మి షేర్ చేయగా అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇంతకీ ఇది కోవ్యాక్జినా... కోవిషీల్డా..? ఫస్ట్ డోసా సెకండ్ డోసా అన్నది మాత్రం చెప్పలేదు. ఏదైతేనేం రాయ్ లక్ష్మి ఇకపై సురక్షితం. షూటింగులకు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అరడజను సినిమాల్ని చకచకా పూర్తి చేసి రిలీజ్ లకు రెడీ చేయించడం తన బాధ్యత.
Full View