సినీ పరిశ్రమకు ఉండే గ్లామరే వేరు. వేరే ఇండస్ట్రీల్లో కోట్లకు కోట్లు సంపాదిస్తున్న వాళ్లకు కూడా సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోవాలని ఉంటుంది. ఎక్స్ పోజర్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి.. తామేంటో రుజువు చేసుకోవాలని.. జనాలకు తెలియజెప్పాలని చాలామంది ఆరాటపడుతుంటారు. బయట వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నా సినీ పరిశ్రమ చుట్టూ తిరుగుతుంటారు. రాజ్ కందుకూరి అలాంటి వాడే.
ఈయనకు కొంచెం పెద్ద బ్యాగ్రౌండే ఉంది. వ్యాపారాలున్నాయి. కానీ కొన్నేళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలోనే తిరుగుతున్నాడు. కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేశాడు. నిర్మాణంలోనూ పాలుపంచుకున్నాడు. అంతే కాక మెగా ఫోన్ పట్టేసి ‘గోల శీను’ అనే సినిమా కూడా తీసేశాడు. కానీ ‘ఈ రోజుల్లో’ ఫేమ్ శ్రీనివాస్ నటించిన ఆ సినిమా వచ్చిన సంగతి తెలియదు. వెళ్లిన సంగతి తెలియదు. ఐతే ఇప్పుడు రాజ్ కందుకూరి ‘పెళ్లి చూపులు’ సినిమాతో మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఈ సినిమాకు నిర్మాత ఆయనే. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ సంపాదించుకున్న ఈ సినిమా స్యూర్ షాట్ హిట్ అంటున్నారు. ఈ శుక్రవారమే విడుదల కానుంది.
ఐతే ఇంతకుముందు దర్శకుడిగా చేదు అనుభవం ఎదురైనప్పటికీ.. రాజ్ కందుకూరి మనసు మార్చుకోవట్లేదు. మళ్లీ ఇంకో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఆల్రెడీ స్క్రిప్టు సిద్ధం చేసుకున్న రాజ్ కందుకూరి.. సందీప్ కిషన్ - నిఖిల్ లాంటి కొంచెం పేరున్న హీరోల కోసమే ట్రై చేస్తున్నాడట. మరి ఆయన్ని నమ్మి వాళ్లు సినిమా చేయడానికి ముందుకొస్తారా?