నీలి చిత్రాల కేసులో అరెస్ట్..అటుపై రిలీజ్ అయిన రాజ్ కుంద్రాపై నెట్టింట నెగివిటీ ఏ రేంజ్లో ఓ వైరల్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. రాజ్ కుంద్ర ఆవ్యక్తిత్వాన్ని..ఆయన భార్య నటి శిల్పాశెట్టిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అప్పటి నుంచి కొన్ని నెలలుగా రాజ్ కుంద్రా ముఖానికి ముసుగేసుకుని తిరుగుతున్నాడు. శిల్పాశెట్టి ఆ ఘటన నుంచి త్వరగానే బయట పడినా..రాజ్ కుంద్రా మాత్రం ఆ మసుగును తొలగించలేకపోయాడు.
మీడియా ..ఫోటోగ్రాఫర్లకు చిక్కకుండా రకరకాల జాగ్రత్తలు తీసుకుని బయట తిరుగుతున్నాడు. అదీ చాలా అరుదుగానే బయటకు కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకీ దూరంగా ఉన్నాడు. ఇన్ స్టా..ట్విటర్ వంటి మాధ్యమాల్లో ఎలాంటి అప్ డేట్లు లేవు. అయితే తాజాగా ట్విటర్లో యాక్టివ్ అయ్యాడు. కొన్ని ట్వీట్లు.. ట్రోల్స్‌పై స్పందించాడు.
ఒక వినియోగదారుడు అతన్ని ప్రముఖ వ్యక్తి అని పిలిచినప్పుడు... రాజ్ కుంద్రా తనను తాను 'ఇన్‌ఫేమస్ గా చెప్పుకున్నాడు. బహిరంగంగా తన ముఖాన్ని ఎందుకు కప్పుకోవాలనుకుంటున్నాడో? కూడా వెల్లడించాడు. మరొక వినియోగదారు అతని ముఖ కవచాన్ని తీసివేయమని అడిగాడు. 'మీ ముఖాన్ని దాచిపెట్టి.. నిజాన్ని ఎదుర్కోండి. మీరు ఏదైనా మంచి లేదా చెడు చేసినట్లయితే.. దానిపై స్టాండ్ తీసుకునే ధైర్యం కలిగి ఉండండి. ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ మీలాగే అంగీకరిస్తారు' అన్నారు.
దానికి రాజ్ కుంద్రా బదులిస్తూ.. 'నేను ప్రజల కోసం నా ముఖాన్ని దాచుకోలేదు. నేను కేవలం మీడియాకి మాత్రమే యాక్సెస్ ఇవ్వకూడదనుకుంటున్నాను. నేను ఎదుర్కొన్న మీడియా విచారణ తర్వాత ఇలాంటివి అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ అదంతా వద్దు అనుకునే ఇలా ఉన్నాను' అన్నారు.
మరో ట్వీట్ లో రాజ్ కుంద్రా ట్రోల్స్‌ను ఉద్దేశించి స్పందించాడు. 'ట్రోల్స్ మీరందరూ మెల్లగా ఎక్కడ కనుమరుగవుతున్నారు. దయచేసి నన్ను విడిచిపెట్టవద్దు' అని సెటైర్ వేసాడు. 'చాలా వార్తా ఛానెల్‌లు వినోద ఛానెల్‌లుగా మారిపోయాయి. ఈనాడు వార్తలన్నీ డ్రామా డ్రామా డ్రామా. ముసుగు వేసుకున్న వ్యక్తి నేటి మీడియా ఉప ఉత్పత్తిగా మారిపోయాడు' అని రాసుకొచ్చారు.
రాజ్ కుంద్రా ఇప్పుడిప్పుడే ఆ ఘటన నుంచి బయటపడుతున్నాడు. మునపటంత బలంగా మారడానికి రెడీ అవుతున్నాడు. అందుకు సతీమణి శిల్పాశెట్టి అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది. మానసిక..మనోధైర్యాన్ని అందిస్తుంది. ముసేగేసుకుని తిరగడం కాదు..మెఉసుగు తీసేసి నిజాయితీ జీవిద్దాం అన్న సంకేతాలు పాస్ చేస్తుంది.
రాజ్ కుంద్రా జూలై 2021లో అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసులో తాను నిర్దోషి అని పేర్కొంటూ సీబీఐకి లేఖ రాశారు. తనను కావాలని కొందరు ఇరికించారని రాజ్ కుంద్రా ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై కోర్టులో విచారణ సాగుతోన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.