రాజ్ తరుణ్‌ సినిమాను కనీసం అక్కడైనా చూస్తారా?

Update: 2021-04-07 08:30 GMT
రాజ్‌ తరుణ్‌ హీరోగా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో వచ్చిన 'పవర్‌ ప్లే' సినిమా నిరాశ పర్చింది. మార్చి 5వ తారీకున థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా కనీసం వారం కూడా ఆడినట్లుగా అనిపించలేదు. ఈ సినిమా వచ్చిన విషయాన్ని చాలా మంది కనీసం గుర్తించే వరకు కూడా సినిమా సందడి చేయలేదు. థ్రిల్లర్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పవర్‌ ప్లే' సినిమా థియేటర్లలో ఆకట్టుకోక పోవడంతో వెంటనే ఓటీటీ ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌ పవర్‌ ప్లే అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇటీవల థియేటర్లలో నిరాశ మిగిల్చిన సినిమాలను వెంటనే ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు థియేటర్లలో నిరాశ పర్చినా కూడా ఓటీటీల్లో పర్వాలేదు అన్నట్లుగా టాక్‌ దక్కించుకుంటున్నాయి. పవర్‌ ప్లే థియేటర్లలో నిరాశ పర్చింది. తాజాగా ఓటీటీలో విడుదల అయిన నేపథ్యంలో అక్కడ అయినా జనాలు చూస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. రాజ్ తరుణ్‌ ఈమద్య కాలంలో మంచి కమర్షియల్ సక్సెస్‌ లను అందుకున్న దాఖలాలు లేవు. దాంతో ఆయన సినిమాలంటే జనాలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.

ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువ అయ్యారు. అయితే వారికి ఎన్నో ఆప్షన్‌ లు ఉన్నాయి. కనుక మంచి సినిమా అయితేనే చూసేందుకు ఆసక్తి చూపిస్తారని ఓటీటీలో చూసే వారు ఎక్కువగా రివ్యూలు చదవి చూసి సినిమా లను చూస్తారనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కనుక రాజ్‌ తరుణ్‌ పవర్‌ ప్లేను ఓటీటీలో కూడా చూసేది అనుమానమే అన్నట్లుగా కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే అమెజాన్‌ మాత్రం ఈ సినిమా పై నమ్మకంతో గౌరవ ప్రథమైన అమౌంట్‌ ను ఇచ్చి కొనుగోలు చేసి స్ట్రీమింగ్‌ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
Tags:    

Similar News