శర్వాను అలా కూడా కాపీ కొట్టేస్తున్నాడే..

Update: 2017-10-08 17:30 GMT
గత రెండు సంక్రాంతి పండగలకు.. ఈ దసరాకు శర్వానంద్ సినిమాలు.. భారీ సినిమాలతో పోటీ పడి మంచి విజయం సాధించాయి. సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఇదే కోవలో తన కొత్త సినిమా ‘రాజు గాడు’ను వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటీకి నిలబెట్టాలని డిసైడయ్యాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఐతే రిలీజ్ విషయంలోనే కాక.. సినిమా కథాంశం విషయంలోనూ రాజ్ తరుణ్.. శర్వానంద్ బాటలో నడుస్తున్నట్లు తాజా సమాచారం.

‘రాజు గాడు’ సినిమాలో రాజ్ తరుణ్ కు ఒక వింత జబ్బు ఉంటుందట. తన ప్రమేయం లేకుండా దొంగతనం చేయడమే ఆ జబ్బు. దొంగతనాలు ఆపుకోలేని బలహీనత అతడికి ఉంటుందట. దీని నేపథ్యంలో సినిమాను సరదాగా నడిపించారని సమాచారం. ‘మహానుభావుడు’ సినిమాలో శర్వాకు అతి శుభ్రతకు సంబంధించి ఓసీడీ అనే డిజార్డర్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి ఇలాగే ‘డిజార్డర్’ను నమ్మకుని వస్తున్న రాజ్ తరుణ్.. ఈ కాన్సెప్ట్ ద్వారా ఎలాంటి ఫలితాన్నందుకుంటడో చూడాలి.

ఓ వ్యక్తి తన ప్రమేయం లేకుండా దొంగతనాలు చేసే లక్షణం సినిమాల్లో చూపించడం ఇది తొలిసారి కాదు. హాలీవుడ్లో కొన్ని సినిమాలు ఈ కాన్సెప్ట్ తో వచ్చాయి. తెలుగులోకి డబ్ అయిన తమిళ సినిమా ‘మేము’లో ఒక పాత్ర ఈ లక్షణాలతోనే సాగుతుంది. ఆ పాత్రతో కామెడీ బాగానే పండించారు. మరి కొత్త దర్శకురాలు సంజనా రెడ్డి ‘రాజు గాడు’లో హీరో పాత్రతో ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన ముంబయి భామ అమైరా దస్తూర్ నటిస్తోంది.
Tags:    

Similar News