హీరోయిన్‌ గురించి ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన హీరో

Update: 2020-12-27 06:50 GMT
ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్‌ తరుణ్‌ మరియు అవికా గౌర్‌ లు హీరో హీరోయిన్‌ లుగా పరిచయం అయ్యారు. ఇద్దరు కూడా అంతుకు ముందు ప్రేక్షకులకు పరిచయమే. కాని హీరో హీరోయిన్‌ గా మాత్రం ఇద్దరు ఒకేసారి పరిచయం అయ్యారు. అప్పటి నుండి వీరి స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంది. వీరిద్దరు కలిసి సుదీర్ఘ కాలం పాటు ట్రావెల్‌ చేస్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో వీరిద్దరి మద్య బాండింగ్‌ మరింత బలంగా మారింది ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. మొన్నటికి మొన్న అవికా తన ప్రియుడిని పరిచయం చేసే వరకు వీరిద్దరి మద్య ఏదో ఉందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

తాజాగా రాజ్‌ తరుణ్ తన కొత్త ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమానికి ఇండస్ట్రీ నుండి ప్రత్యేకంగా అవికాను మాత్రమే ఆహ్వానించాడు. ఆమెతో దిగిన ఫొటోను షేర్‌ చేసిన రాజ్‌ తరుణ్ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టాడు. నా మొదటి సినిమా నుండి నా కొత్తింటి గృహ ప్రవేశం వరకు నువ్వు నా వెంటే ఉన్నావు అంటూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. అవికా తాను మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పింది. లేదంటే వీరిద్దరి మద్య మరింత వ్యవహారం ముదిరిందని పెళ్లికి కూడా రెడీ అవుతున్నారు అంటూ తెగ వార్తలు వచ్చేవి అనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News