కుమారి 21ఎఫ్ తో సూపర్ సక్సెస్ అందుకున్నాక యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. మినిమమ్ గ్యారెంటీ స్థాయి నుంచి కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేని స్టేజికి రాజ్ తరుణ్ రావడం పట్ల అభిమానులు కలత చెందటంలో అర్థముంది. ఈ ఏడాది రాజ్ తరుణ్ మూడు సినిమాలు చేస్తే అన్ని డిజాస్టర్ కు తక్కువ కాకుండా బోల్తా కొట్టడం బాగా ఇబ్బంది పెడుతోంది. అన్నపూర్ణ లాంటి పెద్ద బ్యానర్ తో రంగుల రాట్నం చేస్తే అది వచ్చిన సంగతి టీవీలో చూసేదాకా ప్రేక్షకులకు గుర్తుకు రాలేదు. అంత కన్నా వేగంగా థియేటర్ల నుంచి మాయమయ్యింది తర్వాత వచ్చిన రాజుగాడు. ఇక దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత తీసిన లవర్ సైతం నేనేం తక్కువ తిన్నానా అని రిజల్ట్ ని రిపీట్ చేసింది. పోనీ గత ఏడాది ఏమైనా హిట్లు ఉన్నాయా అంటే ఆ టైంలో వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త-అంధగాడు సినిమాలదీ ఇదే బాట. ఈ నేపధ్యంలో ఏది ముట్టుకున్నా ఇత్తడే అనేలా మారింది రాజ్ తరుణ్ పరిస్థితి.
తన కొత్త సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు రాజ్ తరుణ్. దానికి తోడు ఈ మధ్యే లవర్ విడుదలైన కొద్దిరోజులకే తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకుని వచ్చాడు. సినిమా సక్సెస్ కాలేదు కాబట్టి ఆ కారణం అయ్యుండదు. ఏదైనా పాత మొక్కా లేదా విభిన్నమైన పాత్ర కోసం జుట్టు లేకుండా కనిపించేందుకు కసరత్తు చేస్తున్నాడా ఇంకా ఏ వివరాలు బయటికి చెప్పడం లేదు. రెండేళ్ల క్రితం విడుదలైన ఓ తమిళ రీమేక్ చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి కానీ తర్వాత వాటిని రాజ్ తరుణే కొట్టి పారేసాడు.ఖచ్చితంగా హిట్ కొడితేనే రేస్ లో నిలబడే పరిస్థితుల్లో ఎవరితో సినిమా చేస్తాడు అనేది సస్పెన్స్ గానే ఉంది. లేదూ పూర్తిగా రెస్ట్ తీసుకుని జుత్తు మళ్ళి యధాస్థితికి వచ్చాక కొత్త సినిమాకు రెడీ అవుతాడా లాంటి ప్రశ్నలకు సమాధానం ఒక్క రాజ్ తరుణ్ కు మాత్రమే తెలుసు. అడుగుదాం అంటే మీడియాకు దొరకటం లేదు మరి.