నాది కూడా సేమ్ ఎడ్వయిజ్ -రాజమౌళి

Update: 2016-06-19 05:50 GMT
ఆదివారం పూట అసిస్టెంట్‌ డైరక్టర్ల కోసం ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు జక్కన్న రాజమౌళి. అయితే గతంలో ఈ సలహాలను పూరి జగన్‌ ఫాలో అయ్యాడులే. ఆయనకు ఒక సీనియర్‌ డైరక్టర్ చెప్పాడు. నాది కూడా సేమ్‌ సలహా అంటూ రాజమౌళి ఒక వీడియోను షేర్ చేశాడు.

గతంలో ఒకసారి ఓపెన్ హార్ట్ విత్‌ ఆర్కె ప్రోగ్రామ్‌ లో మాట్లాడుతూ.. పూరి జగన్‌ ఏం చెప్పాడంటే.. ''అప్పట్లో నేను కె.మురళీ మోహనరావు అనే దర్శకుడు దగ్గర అసిస్టెంట్‌ గా జాయిన్ అవుదాం అని వెళ్ళాను. ఆయన ఒక విషయం చెప్పారు. ఒక స్టార్ డైరక్టర్ దగ్గర అసోసియేట్‌ గా పనిచేస్తున్న వారిలో.. ఎవడు డైరక్టర్ అవుతాడో నువ్వు ఐడెంటిఫై చేయి. వాడితో ఫ్రెండ్ షిప్‌ చేయి. వాడు డైరక్టర్ అయితే నీకూ బ్రేక్ వచ్చేస్తుంది. వాడు అవ్వలేదో నీ డెసిషన్ రాంగ్‌ అని చెప్పారు. నేను అలాగే చేశాను. రామ్ గోపాల్‌ వర్మ 'శివ'తో పెద్ద డైరక్టర్‌ అవ్వగానే.. అతని దగ్గర పనిచేసే కృష్ణవంశీతో నేను ఫ్రెండ్‌ షిప్‌ చేశాను. అప్పుడు వంశీ డైరక్టర్ అవ్వగానే నన్ను తన డిపార్టెమెంటులోకి తీసుకున్నాడు. అలా నా ప్రయాణం మొదలైంది'' అంటూ వివరించాడు.

ఇక నుండి రాజమౌళి కూడా ఇదే సలహా ఇస్తున్నాడంట. అంటే రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేయాలంటే కుదరదు కాబట్టి.. ఆయన దగ్గరున్న అసోసియేట్లలో ఎవరు పెద్ద డైరక్టర్ అవుతారో గ్రహించి వారితో ఫ్రెండ్ షిప్‌ చేయమని అంటున్నాడు. మరి అసిస్టెంట్‌ డైరక్టర్లూ.. వింటున్నారా?
Tags:    

Similar News