బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేస్తోంది. ఆ ప్రశ్నకి జవాబు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు బాహుబలి అభిమానులు. అసలు నిజంగానే బాహుబలిని కట్టప్ప చంపుంటాడా? ఆ విషయంలోనూ ఏదైనా ట్విస్టులుంటాయా? అనే చర్చలు కూడా సాగిస్తున్నారు కొందరు. అయితే రాజమౌళి మాత్రం బాహుబలిని కట్టప్ప చంపిన విషయం వాస్తవమే, దాని వెనక ఉన్న డ్రామానే బాహుబలి ది కన్‌క్లూజన్ అని చెబుతున్నాడు. అయినా సరే... ప్రేక్షకులు మాత్రం బాహుబలిని కట్టప్ప కత్తితో పొడుస్తున్నాడా? ఇంతకీ బాహుబలి కడుపులో దిగిన కత్తి కట్టప్పదేనా కాదా? అని ఆ దృశ్యాల్ని ట్రైలర్ లో ఒకటికి పదిసార్లు తదేకంగా చూసుకొంటున్నారు. అయితే కట్టప్ప చేతపట్టిన ఆ పవర్ ఫుల్ కత్తిని మాత్రం హిందీ బాహుబలి డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ కి బహుమానంగా అందజేశాడు రాజమౌళి. గురువారం ఉదయం హైదరాబాద్ లో ట్రైలర్ ని విడుదల చేసిన రాజమౌళి అండ్ టీమ్ సాయంత్రం ముంబైలో జరిగిన వేడుకలో పాల్గొంది.
ఆ వేడుకలోనే రాజమౌళి కట్టప్ప కత్తిని కరణ్ జోహార్ కి బహుమానంగా ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ కత్తి వేసిన పోటు వెనక రహస్యం గురించి మాట్లాడుతుండగా, దాన్ని కరణ్ జోహార్ కి బహుమానంగా ఇచ్చి మరింత ఆసక్తిని రేకెత్తించారు రాజమౌళి. మరి బాహుబలి పాత్రధారి అయిన ప్రభాస్ వాడిన కత్తిని ఎవరికి బహుమానంగా ఇస్తారో చూడాలి. అన్నట్టు కరణ్ జోహార్ కి కట్టప్ప కత్తిని బహుమానంగా ఇవ్వడం కూడా సముచితమే. ఆ చిత్రాన్ని ఆయన హిందీలో డిస్ట్రిబ్యూట్ వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించిపెట్టాడు. సినిమాని కొనడంలో ఆయన చూపిన తెగువ, అక్కడ ప్రమోషన్ విషయంలో చూపుతున్న చాకచక్యతకి తగ్గ బహుమానమే అందుకొన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/