క్రమశిక్షణ అంటే జక్కన్న. జక్కన్న అంటే క్రమశిక్షణ. ఎంత కఠోరంగా శ్రమిస్తారో అంతకుమించి క్రమశిక్షణతో అనుకున్నది సాధిస్తారని పేరుంది. అలాంటి జక్కన్న ముందే తోక ఝాడిస్తామంటే ఎలా? అయినా ఆ ఇద్దరూ మాత్రం అస్సలు అల్లరి వేషాల్లో తగ్గడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పుకుని ఏం చేయాలో అర్థం కానట్టు పెట్టారు ఆ ఫేస్. ఇంతకీ ఎవరా ఇద్దరూ అంటారా? అయితే వివరాల్లోకి వెళ్లాలి.
ఆ ఇద్దరూ మరెవరో కాదు .. ఆర్.ఆర్.ఆర్ స్టార్లు రామారావు.. రామ్ చరణ్. పేరులో `రా` ఉన్నట్టే వీళ్ల అల్లరి కూడా అంతే `రా`గానే ఉంటుందట. సెట్స్ లో ఒకరినొకరు కెలుకుతారు. నవ్విస్తారు.. ఏడిపిస్తారు. వీళ్లు ఆడే ఆటలో జక్కన్నను పావును చేస్తుంటారట. ఆ టైమ్ లో ఏం చేయాలో అర్థంగాక జక్కన్న ఫాలో అయిపోతుంటారట. ఇక ఆ ఇద్దరిలో తారక్ ముందుగా కెలుకుతాడని.. ఆ తర్వాత చరణ్ దానిని ఫాలో అయిపోతుంటాడని కూడా లీకులిచ్చారు రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో చూసిన విషయాల్ని ఓ చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు. తారక్ అల్లరోడే.. చెర్రీ అల్లరోడే. అందుకే అదుపులో పెట్టలేకపోతున్నానని కాస్తంత ఆవేదన చెందాడు.
అదంతా సరే కానీ.. ఇంతకుముందు ప్రభాస్ - రానా చేసిన అల్లరి గురించి ఇలానే చెప్పారు రాజమౌళి. బాహుబలి సమయంలో ప్రభాస్ తన కోస్టార్ అయిన రానాని బాగా కెలికేవాడు. తర్వాత ఇద్దరూ కలిసి అల్లరి చేసేవారు. అయితే ఆ నలుగురు స్టార్లలో ఉన్న ఇంకో క్వాలిటీని జక్కన్న గుర్తు చేశారు. వీళ్లు సెట్లో ఎంత అల్లరి చేసినా కానీ.. పనిలో దిగితే అంతే ఇన్వాల్వ్ అయిపోతారని వెల్లడించారు. బాహుబలి సమయంలో భారీ మేకప్ లు ఉండడంతో రానా- ప్రభాస్ లకు అల్లరికి అవకాశం ఉండేది కాదట. మేకప్ తీసేశాక అల్లరి చేసేవారని వెల్లడించారు జక్కన్న. అల్లరి అంటేనే ఆటవిడుపు. పనిలో ఎంతగా అలిసిపోయినా తిరిగి రిలాక్స్ అవ్వొచ్చు. నవ్వించడం వల్ల ఒత్తిడి తొలగిపోతుంది కదా! అన్నట్టు లాక్ డౌన్ తొలగిపోయేదెపుడు? ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ షూట్ పూర్తయ్యేదెపుడు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఈలోగా ల్యాబుల్లో పనులపై రాజమౌళి దృష్టి సారించారని వార్తలొచ్చాయి.