తాను చూసిన సినిమాలన్నింటికీ.. మనస్సుకు నచ్చితే మాత్రం.. దర్శకుడు రాజమౌళి రివ్యూలు ఇచ్చేస్తుంటాడు. కొత్త సినిమాలు వచ్చినప్పుడు ఆయన ట్విట్టర్లో ఏం రివ్యూ ఇస్తాడా అని చాలామంది చూస్తుంటారు కూడా. అయితే ఈసారి తన స్నేహితుడు సాయి కొర్రపాటి సినిమా ''జ్యో అచ్యుతానంద''కు ఆయన రివ్యూ ఇచ్చేశాడు. పదండి ఏమంటున్నాడో చూద్దాం.
''సాయి కొర్రపాటి గారు.. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల.. అలాగే కంపోజర్ కళ్యాణ్ రమణ కాంబినేషన్ అద్బుతం అని మరోసారి ప్రూవ్ చేశారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టయినర్ లో ఎక్కడా కూడా బలవంతపు సీన్లు లేకపోవడం.. సినిమా చూస్తున్నంత సేపూ హాయిగా ఉండటం.. క్లయమ్యాక్స్ చివరాకర్లో 10 నిమిషాల్లో హృదయాన్ని హత్తుకోవడం బాగుంది. నారా రోహిత్ -నాగ శౌర్య అన్నదమ్ములుగా బాగున్నారు. రెజీనా యాక్టింగ్ ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అదరగొట్టింది. వెంకట్ ఫోటోగ్రాఫీ బాగుంది. ఆర్ట్ డైరక్టర్ రమా.. ''చివరకు మిగిలేది'' అనే నవలను వయస్సు పైబడినట్లు బాగా చూపించారు. కంగ్రాట్స్'' అంటూ రాజమౌళి తన రివ్యూను చెప్పేశాడు.
ఇంకేముంది.. ఆయన ఈ రేంజులో రివ్యూ ఇచ్చారంటే మాత్రం.. అది ఓవర్ టు ఆడియన్స్ అనే చెప్పాలి.