టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా అందరి చూపు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ #RRR పైనే ఉంటుందని చెప్పవచ్చు. ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నుంచి మాలివుడ్ వరకు అన్ని మిడియాలు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కన్నేశాయి. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా హంగామా చేసేస్తున్నారు. రామ్ చరణ్ - తారక్ ఎలా కనిపిస్తారా ? అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాము సంబంధించి ఎవరు ఊహించని ఒక మార్పు జరుగనుందని ఒక టాక్ వస్తోంది. సాధారణంగా జక్కన్న సినిమా చేస్తే అతని టీమ్ లో పెద్దగా మార్పులు ఉండవని అందరికి తెలిసిందే. సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ తో రాజమౌళి వండర్స్ క్రియేట్ చేశాడు. అతను రాజమౌళికి కన్నులాంటోడు. తన ఆలోచనలకు తగ్గట్టు పని చేస్తుండడంతో రాజమౌళి మరో కెమెరామెన్ ను వెతుక్కోలేదు. బాహుబలి కూడా అతనే తీశాడు. ఇకపోతే ఈ సారి రాజమౌళి ఆ ఛాన్స్ వేరే వ్యక్తికి ఇవ్వనున్నట్లు కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి.
మహానటి సినిమాతో కేమెరా వర్క్ కు కొత్త అర్ధాన్ని చెప్పిన డాని తో కలిసి రాజమౌళి వర్క్ చేయాలని అనుకుంటున్నాడట. మహానటి సినిమా విజయంలో కేమెరా పని తనం చాలానే ఉంది. ప్రతి షాట్ లో ఒక అర్థం ఉంటుంది. దీంతో జక్కన్న ఆ విదేశీ టెక్నీషియన్ పై మనసు పారేసుకున్నాడట. దాదాపు స్క్రిప్ట్ పనులను ఫినిష్ చేసుకున్న రాజమౌళి తన టీమ్ తో ఒకసారి మీటింగ్ నిర్వహించనున్నాడు. ఇక ఫైనల్ గా సెంథిల్ కుమార్ ను తీసేసి డాని ని ఫైనల్ చేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.