#RRR లో జక్కన్న హిట్ ఫార్ములా!?

Update: 2018-06-04 12:34 GMT
రాజమౌళి మల్టి స్టారర్ #RRR రిలీజ్ తరువాత ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో తెలియదు గాని ఇప్పుడు మాత్రం రోజుకో రూమర్ తో జనాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సినిమా ఎలా ఉన్నా కూడా రాజమౌళి మార్క్ ఉండడం అందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ పదిహేనేళ్ల కెరీర్ లో జక్కన్న ప్రతి సినిమాలో ఎదో ఒక ఫార్ములా కనిపిస్తుంటుంది. ఇక నెక్స్ట్ రామ్ చరణ్ - ఎన్టీఆర్ మల్టి స్టారర్ లో కూడా అదే కనిపించనుందని సమాచారం.

మగధీర - ఈగ సినిమాల్లో రాజమౌళి పునర్జన్మల ఫార్ములాను గట్టిగా వాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో తన విజన్ కి పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది. రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే పూర్తీ కథను ఫినిష్ చేశాడు. ప్రస్తుత స్క్రీన్ ప్లే కు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. కథలో కీలకమైన రీ బర్త్ ప్రక్రియ విషయంలో ఇంకాస్త ఎక్కువ పెన్ వర్క్ జరిగే అవకాశం ఉందట.

ఇంతకుముందు బాక్సింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని టాక్ బాగా వచ్చింది. కానీ రామ్ చరణ్  ఇంటర్వ్యూలో అది కాదు అన్నట్లు సమాధానం ఇచ్చాడు. ఇక ఇప్పుడు పునర్జన్మల నేపథ్యం అని తెలుస్తుండడంతో తప్పకుండా సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఫ్యాన్స్ ఎవరి స్టైల్ లో వాళ్లు ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ న్యూస్ తెలిస్తే ఎలాంటి పోస్టర్స్ దర్శనం ఇస్తాయో చూడాలి.
Tags:    

Similar News