సీనియర్ హీరో రాజశేఖర్ కు మాట తడబడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఐతే తెలుగు సరిగా రాక ఆయనలా మాట్లాడతారేమో అని చాలామంది అనుకుంటారు. ఐతే దశాబ్దాలుగా తెలుగునాట ఉంటూ.. తెలుగులో మాట్లాడుతున్నా ఆయన మాటేమీ మారలేదు. దీనికి కారణం తనకు నత్తి ఉండటమే అని ఆయన అంగీకరించారు.
ఈ విషయంలో దాపరికాలేమీ లేవని.. తాను ఈ విషయం చెప్పుకోవడానికి సిగ్గు పడనని అన్నాడు రాజశేఖర్. తెలుగు మాత్రమే కాదని.. తమిళం అయినా.. ఇంగ్లిష్ అయినా.. ఏ భాష అయినా తనకు మాట తడబడుతుందని రాజశేఖర్ చెప్పారు. ఇలా తన లోపాన్ని కవరింగ్ ఏమీ లేకుండా అంగీకరించినందుకు రాజశేఖర్ అభినందనీయుడే. స్వతహాగా తమిళుడైన రాజశేఖర్ కెరీర్ ఆరంభం నుంచి డబ్బింగ్ ఆర్టిస్టుల మీదే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు సాయికుమార్ దీర్ఘ కాలంగా డబ్బింగ్ చెబుతున్నారు. రాబోయే ‘గరుడవేగ’ సినిమాలోనూ రాజశేఖర్ కు సాయికుమారే వాయిస్ ఇచ్చాడు.
ఇటీవల తన తల్లి మరణించడం గురించి కూడా మీడియా ముందు ఓపెనయ్యాడు రాజశేఖర్. ఆమె మరణం నుంచి తాను కోలుకోలేకపోతున్నట్లు చెప్పాడు. స్వతహాగా వైద్యుడై ఉండి కూడా తాను తన తల్లికి సకాలంలో వైద్య చికిత్స అందించలేకపోయినట్లు చెప్పాడు రాజశేఖర్. తన తల్లి మరణంతో తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు చెప్పాడు రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవడంతో రాజశేఖర్ కారుకు ప్రమాదమైందని అంటున్నారు.