జీవిత-రాజశేఖర్ దంపతులు నిన్ననే దేశ ప్రధాని మోడీని కలిశారు. డాటర్స్ శివాని - శివాత్మిక లతో కలిసి నేరుగా ప్రధాని స్వగృహానికే వేంచేసి అక్కడ ఓ ఫ్యామిలీ ఫోటో కూడా దిగారు. ఈ ఆనందాన్ని అనంతరం మీడియాతోనూ పంచుకున్నారు. ఇలా ఉన్నట్టుండి మోడీని కలవడం వెనక ఏదైనా రాచకార్యం ఉందా? అంటే అలాంటిదేం లేదు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వారు నిన్నడాక్టర్ రాజశేఖర్ - జీవితలకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గృహానికి వెళ్ళి కలిశారు. కేవలం ప్రధానిపై అభిమానంతో మాత్రమే కలిశారన్నది టాక్.
కట్ చేస్తే.. అప్పట్లో ఎన్నికల సమయంలో బిజెపి తరుపున ప్రచారంలో జోరుగా పాల్గొనడమే కాకుండా మోడి మీద ఒకపాటను కూడా విడుదల చేసిన జీవిత తరువాత సినీపరిశ్రమకు సంబంధించిన ఓ కీలక బాధ్యతను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీవిత కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు. ప్రధానిని రాజశేఖర్ దంపతులను సాదరంగా ఆహ్వానించి 20 నిముషాల సేపు వీరితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు అంశాలు వీరి మధ్య చర్చకొచ్చాయి.ముఖ్యంగా రాజశేఖర్ తయారు చేసి ఇచ్చే ప్రత్యేక హోమియో మందు గురించి ప్రధాని అడిగి తెలుసుకోవడం విశేషం. ప్రధాని నరేంద్రమోడి తాను ఎంత బిజీగా ఉన్నప్పటికి రాజశేఖర్ దంపతులతో 20 నిముషాలు మాట్లాడటం పట్లవారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
శివాని - శివాత్మిక అయితే ఏకంగా అచ్ఛం హిందీలో మాట్లాడేస్తూ ప్రధానిని ఎంతో ఆకట్టుకున్నారు. మోదీ తన మాతృమూర్తిని ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ దంపతులకు పరిచయం చేశారు. అంతేకాదండోయ్... మనం మన సమయాన్ని కేవలం ఎంచుకున్న మిషన్ మీద కేటాయించాలి. ఇతరత్రా వ్యాపకాలు అనవసరం అన్న నీతివాక్యాన్ని కూడా సదరు దంపతుల చెవిన వేశారు ప్రధాని. ప్రస్తుతం జీవిత రాజశేఖర్ మిషన్ ఏమై ఉంటుంది? అన్నది ఆ సందర్భంలో చర్చకొచ్చింది!