రాజశేఖర్ 'గరుడవేగ' సినిమాకి ముందు హిట్ అనే మాట వినక సతమతమైపోయారు. ఆర్ధికంగా రిస్క్ చేసి మరీ ఆ సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తరువాత మంచి కథ కోసం కొంత గ్యాప్ తీసుకుని 'కల్కి' చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కథ .. ఖర్చు రెండూ కూడా వృథా అయ్యాయి. ఆ తరువాత ఆయన విభిన్నమైన కథాంశంతో వెళ్లాలనే ఉద్దేశంతో ఈ సారి గట్టిగానే కసరత్తు చేశారు. ఫలితంగా వెంకటేశ్ మహా దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి 'మర్మాణువు' అనే డిఫరెంట్ టైటిల్ ను ప్రకటించి అందరిలో ఆసక్తిని రేపుతున్నారు.
'మర్మాణువు' అంటే రహస్య ప్రదేశం .. రహస్య స్థానం అనే అర్థాలు ఉండటం వలన, ఈ సినిమా టైటిల్ పోస్టర్ చూసినవాళ్లు .. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ గా భావిస్తున్నారు. జమీందారి కాలంనాటి కథగా అనుకుంటున్నారు. జమీందారు .. ఆయన వారసత్వ సంపదకు సంబంధించిన అన్వేషణగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే .. ఈ తరహా జోనర్లో రాజశేఖర్ చేస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. ఈ తరహా కథలు .. పాత్రలు ఆయనకి బాగా సెట్ అవుతాయి కూడా. ఈ సినిమాకి రాజశేఖర్ కూతుళ్లు నిర్మాణ భాస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో వాళ్లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు.
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచిలో ఎంతో మార్పు వచ్చింది. తెరపై భారీ సెట్లను .. భారీ ఫైట్లను వాళ్లు కోరుకోవడం లేదు. అలాగే నాన్ స్టాప్ గా హీరో చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ ను వినాలని కూడా అనుకోవడం లేదు. కథలో ఎక్కువ మలుపులను కూడా వాళ్లు ఆశించడం లేదు. కంటెంట్ లో కొత్తదనం ఉంటే చాలు .. కొత్త టీమ్ చేసిన ప్రయత్నానికి కూడా హిట్టును రాసిచ్చేస్తున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే హీరోలు ముందుకు వెళుతున్నారు. అలా రాజశేఖర్ కూడా వైవిధ్యభరితమైన కంటెంట్ తో రంగంలోకి దిగారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.