అవును.. ఆ హీరోగారు తాగి గుడికెళ్లారు. లవ్ ప్రపోజ్ చేశారు. దేవుడికి మొక్కి ఎలాగైనా తన ప్రేయసి తనకు దక్కాలని కోరారు. ఇంతకీ ఎవరా హీరో? అంటే.. పేరు డా.రాజశేఖర్. యాంగ్రీ హీరోగా సుపరిచితం. ఈ వెటరన్ స్టార్ పెళ్లాడింది సినిమా హీరోయిన్ జీవితనే అయినా కానీ అంతకుముందే సినిమా రేంజులో అదిరిపోయే ఓ లవ్ స్టోరీ ఉంది. ఆ సంగతిని తనే స్వయంగా చెప్పారు. అసలింతకీ ఏమా ప్రేమకథ? అంటే..
జీవితను ప్రేమించి పెళ్లాడక ముందే తనకో లవ్ స్టోరీ ఉందని.. అయితే అది ఫెయిలైందని చెప్పుకొచ్చారు. తనకంటే వయసులో ఐదేళ్లు పెద్ద అమ్మాయిని ప్రేమించానని.. అయితే `పోరా నీతో నా లవ్ కుదరద`ని తను అన్నదని తెలిపారు రాజశేఖర్. అయినా తాను రోజూ వెంటపడేవాడినని దాంతో చివరికి పెద్దల వరకూ ఇష్యూ వెళ్లిందని జీవిత ముందే ఓ టీవీ కార్యక్రమంలో చెప్పడం షాకిచ్చింది. ఆ క్రమంలోనే తన ప్రేమ ఫెయిలవుతుందన్న భయంతో అసలు దేవుడు అంటే గిట్టకపోయినా.. గుడికి వెళ్లి మొక్కానని వెల్లడించారు. తాగి వచ్చినందుకు క్షమించమని దేవుడిని ప్రార్థించారట. తాను గుడికి వెళ్లిన వారం రోజుల్లోనే ఆ యువతి వచ్చి `ఐ లవ్ యు` చెప్పిందని తెలిపారు రాజశేఖర్.
అన్నట్టు ఆవిడను పెళ్లాడకుండా జీవితనే ఎందుకు పెళ్లాడారు? అన్నది మాత్రం ఆయన రివీల్ చేయలేదు. ఇకపోతే తలంబ్రాలు- ఆహుతి- అంకుశం- మగాడు లాంటి సినిమాలలో రాజశేఖర్- జీవిత జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే స్నేహం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లయ్యింది. తొలిసారి జీవిత తనకు పరిచయం అయినప్పుడు ఆమె నల్లగా ఉంది.. నా పక్కన హీరోయిన్ గా వద్దని అన్నారట. కానీ ఆ నిర్మాత రాజశేఖర్ ని పక్కన పెట్టి జీవితను హీరోయిన్ గా తీసుకుని సినిమా తీశారు. ఆ తర్వాత జీవితకు ఆ ఛాయిస్ వస్తే.. రాజశేఖర్ తన సరసన హీరోగా కావాలని కోరిందట. అదండీ హిస్టరీ వీకీపిడియాలో గ్రేట్ లవ్ స్టోరీ కదూ?