గతంలో రచయితలు దర్శకులుగా మారారు .. డాన్సు మాస్టర్లు దర్శకులుగా మారారు .. సినిమాటోగ్రఫర్లు దర్శకులుగా మారారు. ఇక ఈ మధ్య కాలంలో ఎడిటర్లు కూడా దర్శకత్వం దిశగా అడుగులు వేస్తున్నారు. అలా ఎడిటింగ్ వైపును నుంచి వచ్చిన రాజశేఖర్ రెడ్డి మెగాఫోన్ పట్టాడు . సుధాకర్ రెడ్డి - నికితా రెడ్డి నిర్మించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో దర్శకుడిగా ఆయన పరిచయమవుతున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ .. " ఈ స్టేజ్ కి నేను రావడానికి 15 ఏళ్లు పట్టింది. అందరిలాగానే నేను కూడా కష్టాలు పడుతూనే ఇక్కడివరకూ వచ్చాను. నేను ఇంటర్ చదువుతూ ఉండగా మా ఫాదర్ పోయారు.
అప్పటి నుంచి మిగతా కుటుంబ సభ్యులంతా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు .. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత మరికొందరు సపోర్ట్ చేశారు .. వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఇండస్ట్రీలో నన్ను ఒక టెక్నీషియన్ గా నిలబెట్టిన నా దేవుడు పూరి జగన్నాథ్ కి థ్యాంక్స్ చెబుతున్నాను.
ఎడిటర్ నుంచి డైరెక్టర్ గా చేసిన నితిన్ గారికి పెద్ద థ్యాంక్స్ చెబుతున్నాను. నితిన్ 'లై' సినిమా చేస్తున్నప్పుడు, మంచి కథ రెడీ చేసుకుంటే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని నాతో అన్నాడు. ఆ తరువాత నేను ఆయనకి కథ చెప్పడం .. ఆయన నాకు అవకాశం ఇవ్వడం జరిగిపోయాయి. మాట నిలబెట్టుకోవడం చాలా తక్కువమంది చేస్తుంటారు. అలాంటి వాళ్లలో మనసున్నవాడు మా నితిన్. ఫ్రెండ్షిప్ ను నిలబెట్టుకునేవారు కొందరే ఉంటారు .. వాళ్లలో ఫస్టు మా నితిన్ ఉంటాడు.
లాస్ట్ వీక్ విడుదలైన రెండు సినిమాలు ఎలాగైతే సక్సెస్ అయ్యాయో ... అలాగే నెక్స్ట్ వీక్ వచ్చే మా సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను.
సాలీడ్ హిట్ కొట్టబోతున్నామని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. సుధాకర్ గారు నన్ను ఎడిటర్ గా తమ బ్యానర్లో పెట్టుకున్నారు .. ఆ తరువాత డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆయన రుణాన్ని ఈ నెల 12వ తేదీన తీర్చుకోబోతున్నాను. నటీనటులు .. సాంకేతిక నిపుణులు ఎంతో అంకితభావంతో పనిచేశారు. వాళ్లంతా ఇచ్చిన అవుట్ పుట్ కారణంగానే నేను ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను" అన్నాడు.