ఇకపోతే ఈ రోజు ఉదయం తిరుమలలో మీడియాతో మాట్లాడిన నటుడు రాజేంద్రప్రసాద్.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హోదాలో.. పవన్ కళ్యాణ్ మరియు నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ ల మధ్యన సెటిల్ మెంట్ అయిపోయిందని వివరించారు.
''ఎక్కడన్నా రుణం ఉంచుకోవచ్చు కాని.. ఏడుకొండల వాడి వద్ద మాత్రం కుదరదండీ.. నాన్నకు ప్రేమతో హిట్ చేసినందుకు స్వామి వారికి సవినయంగా తలనీలాలు సమర్పించుకోవడం జరిగింది'' అంటూ సెలవిచ్చారు రాజేంద్రప్రసాద్. తన పేరు మీద ఉన్న కాటేజీను కూడా రెనోవేట్ చేసి స్వామి వారికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక అత్తారింటికి దారేది సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ కు ఇవ్వవలసిన 2 కోట్లు గురించి మాట్లాడుతూ.. ''పద్దతి ప్రకారం మన అసోసియేషన్ ద్వారా ప్రొడ్యూసర్ల కౌన్సిల్ తో మాట్లాడి.. సుముఖంగా దానిని పరిష్కరించాం'' అంటూ తెలిపారు.