ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ - అక్షయ్ కుమార్ కాంబినేషన్ లోని 2.ఓ ట్రైలర్ రానే వచ్చింది. ఈ ట్రైలర్ లో మాయాజాలం అభిమానుల్ని కట్టిపడేసింది. ముఖ్యంగా ఇందులో చిట్టీ రోబోట్ ని - క్రోమ్యాన్ ని పోటాపోటీగా ఎలివేట్ చేసిన తీరు రంజింపజేసింది. అదంతా అటుంచితే ఈ వేడుకకు ఏకంగా జాతీయ మీడియాతో పాటు - అన్ని ప్రాంతీయ భాషల నుంచి భారీగా మీడియా విచ్చేసింది. ఆ క్రమంలోనే ఈ వేదిక వద్ద ఓ రకంగా అలజడి నెలకొందని తెలుస్తోంది. చెన్నయ్ సత్యం థియేటర్ వద్ద భారీ బందోబస్తు నడుమ ఈ ఈవెంట్ ని నిర్వహించారు. ఈవెంట్ లో తెలుగు మీడియా సైతం సందడి చేసింది. అయితే వేదిక వద్ద ఇంతమంది మీడియా ప్రతినిధుల్ని కంట్రోల్ చేయడానికి నిర్వాహకులకు తలకు మించిన భారమే పరిణమించిందిట. ఓవైపు మీడియా ప్రతినిధులకు - మరోవైపు నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుందన్న సమాచారం ఉంది.
ఇక ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ తన భార్య లతా - ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. అలానే శంకర్ తన ఇద్దరు కుమార్తెలు - భార్యతో కలిసి వేడుకను తిలకించారు. ఏ.ఆర్.రెహమాన్ - రసూల్ పోకుట్టి - అక్షయ్ కుమార్ తదితరులు ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక 2.ఓ ట్రైలర్ ని మీడియా సభ్యులంతా 3డి వెర్షన్ లో వీక్షించారు. అందుకోసం అవసరమైన కిట్ లను థియేటర్ స్టాఫ్ అందించారు.
ఈ ట్రైలర్ కి మరో ప్రధాన ఆకర్షణ ఏమంటే.. థియేటర్ లో వినిపించిన సౌండింగ్ ఇదివరకెన్నడూ విననిది.. కననిది అని చెబుతున్నారు. 4డి సౌండ్ సిస్టమ్ వండర్ ఫుల్ ట్రీట్ ని ఇచ్చిందని తెలుగు మీడియా నుంచి సమాచారం అందింది. మొత్తానికి 2.ఓ ట్రైలర్ ట్రీట్ ని దేశం నలుమూలల నుంచి విచ్చేసిన మీడియా సహా అహూతులంతా గొప్పగా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది. ఈ వేడుకలో ఏ.ఆర్.రెహమాన్ రీరికార్డింగ్ ప్రతిభ గురించి - టెక్నాలజీపై అతడికి ఉన్న గ్రిప్ గురించి మరోసారి ఆసక్తికర చర్చా సాగింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఇక సినీరంగాన్ని వదిలేయాలనుకున్న రెహమాన్ రజనీ స్ఫూర్తితో ఇంకా కొనసాగుతున్నానని చెప్పడం మరో కొసమెరుపు.